కమల్ హాసన్ కంటే చరణే ఎక్కువ..?

తాజాగా గేమ్ చేంజర్ మూవీ హిందీ థీయాట్రికల్ రైట్స్ ని అనిల్ తడాని ఏకంగా 75 కోట్లకి కొనుగోలు చేశారు. అయితే అదే భారతీయుడు 2 హిందీ వెర్షన్ థీయాట్రికల్ రైట్స్ కేవలం 20 కోట్లకి మాత్రమే వెళ్ళింది.

Update: 2024-04-19 13:52 GMT

సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ రెండు పెద్ద ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సీక్వెల్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తమిళ్ నుంచి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా సిద్ధం అవుతోంది. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. మరో వైపు తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.

తెలుగు నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ రెండు సినిమాలని భారీగానే శంకర్ తెరకెక్కిస్తున్నారు. భారతీయుడు 2 మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ భారతీయుడుకి సీక్వెల్ గా సిద్ధం అవుతోంది. అయితే మార్కెట్ లో భారతీయుడు 2 సినిమా కంటే గేమ్ చేంజర్ సినిమాకి ఎక్కువ హైప్ ఉంది. బిజినెస్ పరంగా చూసుకున్న గేమ్ చేంజర్ మూవీకి ఎక్కువ డిమాండ్ ఉండటం విశేషం.

తాజాగా గేమ్ చేంజర్ మూవీ హిందీ థీయాట్రికల్ రైట్స్ ని అనిల్ తడాని ఏకంగా 75 కోట్లకి కొనుగోలు చేశారు. అయితే అదే భారతీయుడు 2 హిందీ వెర్షన్ థీయాట్రికల్ రైట్స్ కేవలం 20 కోట్లకి మాత్రమే వెళ్ళింది. ఈ డీల్ బట్టి కమల్ హాసన్ కంటే రామ్ చరణ్ కి ప్రస్తుతం దేశీయంగా ఎక్కువ మార్కెట్ ఉందని అర్ధమవుతోంది. అలాగే డిజిటల్ రైట్స్ విషయంలో కూడా గేమ్ చేంజర్ కి ఎక్కువ ఆఫర్స్ లభిస్తున్నాయని టాక్.

ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రామ్ చరణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. గ్లోబల్ స్టార్ బ్రాండ్ తో దేశవ్యాప్తంగా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే కమల్ హాసన్ సీనియర్ హీరోగా ఉన్నా కూడా కోలీవుడ్ కి పరిమితం అయ్యారు. అతని నుంచి వచ్చిన చివరి చిత్రం విక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన నార్త్ లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు.

ఈ కారణంగానే భారతీయుడు 2ని బిజినెస్ పరంగా గేమ్ చేంజర్ ఫుల్ గా డామినేట్ చేస్తోంది. భారతీయుడు 2 మూవీ జూన్ 13 లేదా 14 డేట్స్ లో రిలీజ్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక గేమ్ చేంజర్ మూవీ అక్టోబర్ లేదా డిసెంబర్ లో రానుందని తెలుస్తోంది. శంకర్ నుంచి రాబోయే ఈ సినిమాలలో ఏది బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News