అందులో న‌టించాల్సింది చిరంజీవా!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా పి. వాసు తెర‌కెక్కించిన హార‌ర్ థ్రిల్ల‌ర్ `చంద్ర‌ముఖి` అప్ప‌ట్లో ఎలాంటి విజ‌యం న‌మోదు చేసిందో తెలిసిందే.

Update: 2024-10-18 09:30 GMT

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా పి. వాసు తెర‌కెక్కించిన హార‌ర్ థ్రిల్ల‌ర్ `చంద్ర‌ముఖి` అప్ప‌ట్లో ఎలాంటి విజ‌యం న‌మోదు చేసిందో తెలిసిందే. సూప‌ర్ స్టార్ కెరీర్ లో ఇదొక మైల్ స్టోన్ లా నిలిచింది. అంత‌వ‌ర‌కూ సూప‌ర్ స్టార్ అంటే యాక్ష‌న్ సినిమాలు...త‌నదైన స్టైల్లో మెప్పించ‌డమే స్టైల్. కానీ చంద్ర‌ముఖి ర‌జినీలో కొత్త న‌టుడ్ని బ‌య‌ట‌కు తెచ్చింది. ప్రోఫెస‌ర్ పాత్ర‌లో ర‌జ‌నీ ఎంతో సెటిల్డ్ గా పెర్మార్మెన్స్ ఇచ్చారు.

దాదాపు రెండు ద‌శాబ్ధాల క్రిత‌మే ఈ సినిమా 70 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను తెచ్చి పెట్టింది. ఈ సినిమాకి పెట్టిన బ‌డ్జెట్ 19 కోట్లు మాత్ర‌మే. స్నేహితుడు ప్ర‌భు కోసం ర‌జ‌నీ ఈ సినిమా చేసిన‌ట్లు అప్ప‌ట్లో చెప్పుకునే వారు. అయితే ఈ సినిమాలో న‌టించాల్సింది ర‌జ‌నీకాంత్ కాదు..మెగాస్టార్ చిరంజీవి అన్న సంగ‌తి ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. చిరంజీవి ఈ క‌థ‌ని రిజెక్ట్ చేయ‌డంతోనే ర‌జ‌నీకాంత్ కి వెళ్లిందిట‌. క‌న్న‌డ వెర్ష‌న్ చంద్ర‌ముఖి చూడాల‌ని చిరంజీవిని ద‌ర్శ‌కుడు కోరారుట‌.

ఆయ‌న కోరిక మేర‌కు సినిమా చూసిన త‌ర్వాత చిరంజీవి అనాన‌స‌క్తిని వ్య‌క్తం చేసారుట‌. అప్ప‌టికే ఆ సినిమా మ‌ల‌యాళ చిత్రం `ముణిచిత్ర‌కు` రీమేక్ వెర్ష‌న్. అందులో శోభ‌న ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా, సురేష్ గోపి హీరోగా నటించారు. ఇదే కథను 2003లో `ఆప్తమిత్ర` పేరుతో కన్నడలో తెరకెక్కించారు. ఇందులో ప్రధాన పాత్రని సౌందర్య పోషించారు. ఇదే చిత్రాన్ని ర‌జ‌నీకాంత్ హీరోగా వాసు తెర‌కెక్కించారు. అలా చిరంజీవి చంద్ర‌ముఖ‌ని దూరం చేసుకున్నారు.

`చంద్ర‌ముఖి` రిలీజ్ త‌ర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా నాగ‌వ‌ల్లి, చంద్ర‌ముఖి-2 అంటూ మ‌రో రెండు చిత్రాలు రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే చంద్ర‌ముఖిని చిరంజీవి రిజెక్ట్ చేయ‌డానికి చాలా కార‌ణాలు న్నాయి. అది క‌మ‌ర్శియ‌ల్ చిత్రం కాదు. పైట్లు..పాట‌లు..హీరోయిన్ల‌తో డాన్సులు ఏవీ ఉండవు. చిరంజీవికి మాస్ ఇమేజ్ ఉంది. అలాంటి స్టార్ హార‌ర్ సినిమాలో న‌టిస్తే ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అన్న సందేహం ఉండొచ్చు. తెలుగు ఆడియ‌న్స్ ప‌ల్స్ ఆయ‌న‌కు బాగా తెలుసు. అందుకే వ‌ర్కౌట్ అవుతుందో? లేదా? అన్న సందిగ్దంలో లైట్ తీసుకుని ఉంటారు.


Tags:    

Similar News