నాగ్ అశ్విన్ మేధోత‌నానికి మెగాస్టార్ హ్యాట్సాఫ్‌

ప్ర‌భాస్ న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ క‌ల్కి 2989 ఎడి ఈ గురువారం విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బ‌ద్ధ‌లు కొడుతోంది

Update: 2024-06-27 14:41 GMT

ప్ర‌భాస్ న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ క‌ల్కి 2989 ఎడి ఈ గురువారం విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బ‌ద్ధ‌లు కొడుతోంది. ఆరంభ రోజులు గ‌నుక‌ టికెట్ బుకింగులు క్రాష్ అయ్యే స‌న్నివేశం నెల‌కొంది. ఈ సినిమాకి ఉద‌యం నుంచి పాజిటివ్ స‌మీక్ష‌లు అంత‌ర్జాలంలో పోటెత్త‌డంతో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. వైజ‌యంతి మూవీస్ అధినేత‌లు .. నాగ్ అశ్విన్ బృందం స‌హా ప్ర‌భాస్ ఇత‌ర న‌టీన‌టులు సెల‌బ్రేష‌న్ మోడ్ లో ఉన్నారు. ముఖ్యంగా ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాల నుంచి క‌ల్కి రిజ‌ల్ట్ పై అభినంద‌న‌ల‌తో కూడిన‌ ప్ర‌శంస‌లు కురుస్తుంటే మేక‌ర్స్ పూర్తిగా మ‌బ్బుల్లో తేల్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నుంచి క‌ల్కి టీమ్ కి అభినంద‌న‌లు అందాయి. చిరు త‌న ఎక్స్ ఖాతాలో క‌ల్కి విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని చిత్ర‌బృందాన్ని అభినందించారు. చిరు ఎక్స్ లో ఇలా రాసారు. ``#క‌ల్కి 2898AD గురించి అద్భుతమైన రిపోర్టులు వినబడుతున్నాయి! వందనాలు నాగ్ అశ్విన్... అలాంటి గొప్ప స్టార్ డ‌మ్ ఉన్న‌ తారాగణంతో ఈ మిథో-సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్‌ని రూపొందించినందుకు మీ సృజనాత్మక మేధోత‌నానికి వంద‌నాలు....శ్రీ బచ్చన్ .. ప్రభాస్.. దీపికపదుకొనే.. క‌మ‌ల్ హాస‌న్ వంటి స్టార్ల‌తో ప‌ని చేసావు. నా అభిమాన నిర్మాత అశ్వ‌నిద‌త్‌కు హృదయపూర్వక అభినందన‌లు. ధైర్యవంతులు స్వ‌ప్నా ద‌త్, ప్రియాంకదత్ & మొత్తం టీమ్ కి శుభాకాంక్ష‌లు. ``కలలు కనండి.. భారతీయ జెండాను ఎగురవేయండి. సినిమాని మరింత ఉన్నతంగా ఎగర‌నివ్వండి!`` అని చిరు విష్ చేసారు.

Read more!

చూస్తుంటే.. నాగ్ అశ్విన్ - అశ్వ‌నిద‌త్ బృందానికి `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` సీక్వెల్ తీసే ఛాన్స్ ద‌క్కుతుంద‌నిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి క‌ల్కి విజ‌యంలో కీల‌క వ్య‌క్తులు అయిన ఆ ఇద్ద‌రినీ ఎంత‌గానో పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. క‌ల్కి త‌ర్వాత అలాంటి మ‌రో క్రేజీ ప్రాజెక్టును నాగ్ అశ్విన్ డీల్ చేస్తారేమో చూడాలి.

Tags:    

Similar News