చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌గా మెగా బ్లాక్‌బస్టర్ రీ-రిలీజ్!
ఆగస్టు 22న చిరంజీవి తన పుట్టినరోజును జరుపుకోనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ 70వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ "ఇంద్ర". బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సి. అశ్వినీ దత్ నిర్మించారు. నేటితో ఈ సినిమా 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2002 జూలై 24న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అయితే అభిమానులకు ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో చూసే అవకాశం దక్కుతోంది. వైజయంతీ మూవీస్ 50 గోల్డెన్ ఇయర్స్ సెలబ్రేషన్స్ లో భాగంగా, చిరు బర్త్ డే స్పెషల్ గా ఈ సినిమాని రీ-రిలీజ్ చేస్తున్నారు.
ఆగస్టు 22న చిరంజీవి తన పుట్టినరోజును జరుపుకోనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ 70వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వారి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయడానికి అన్నట్లుగా అదే రోజున "ఇంద్ర" చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఈ మెగా బ్లాక్ బస్టర్ ను రీరిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2002లో ₹10 కోట్ల బడ్జెట్‌తో తీసిన 'ఇంద్ర' సినిమా.. బాక్సాఫీసు దగ్గర ₹55 కోట్లకు పైగా వసూలు చేసి, అత్యధిక కలెక్షన్లు అందుకున్న తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమే కాదు, ఆ ఏడాదికి అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ మూవీగానూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రం మూడు రాష్ట్ర నంది అవార్డులతో పాటుగా రెండు సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఇంద్రసేనారెడ్డిగా, శంకర్ నారాయణగా అధ్బుతమైన నటన కనబరిచిన చిరంజీవి.. బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డుతో పాటుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.
'ఇంద్ర' సినిమాలో చిరు సరసన ఆర్తీ అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. మాస్టర్ తేజ సజ్జా చిన్నప్పటి ఇంద్రసేనారెడ్డి పాత్ర పోషించారు. దివంగత అల్లు రామలింగయ్య, ప్రకాశ్ రాజ్, ముఖేష్ రుషి, సునీల్, శివాజీ, పునీత్ ఇస్సార్, తనికెళ్ల భరణి, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, సునీల్, ఎమ్మెస్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అతిధి పాత్రలో కనిపించారు.
'ఇంద్ర' చిత్రానికి రచయిత చిన్ని కృష్ణ కథ అందించగా.. పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. శివ ఆకుల డైలాగ్స్ రాశారు. వీఎస్ఆర్ స్వామి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణి శర్మ చార్ట్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేశారు. 22 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.