సీఎంని స్వయంగా కలిసి కోటి చెక్ అందించిన చిరంజీవి!
ఈ చర్చలో భాగంగా కేరళలో ప్రస్తుత పరిస్థితులన్నింటిని చిరంజీవి అడిగి తెలుసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ ని కలిసారు. వయనాడ్ విపత్తుపై స్పందిస్తూ తన వంతు బాధ్యతగా కోటి రూపాయల చెక్కును స్వయంగా చిరంజీవి ముఖ్యమంత్రికి అందించారు. ఈ సందర్భంగా చిరంజీవికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిజేసారు. అనంతరం ఇద్దరు కాసేపు మాట్లాడు కున్నారు. ఈ చర్చలో భాగంగా కేరళలో ప్రస్తుత పరిస్థితులన్నింటిని చిరంజీవి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి అందించిన కోటి రూపాయల విరాళంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భాగం కూడా ఉంది. తండ్రి-తనయులిద్దరు కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్లు తండ్రి-తనయులు ఇద్దరు ప్రకటించారు. దీనిలో భాగంగా చిరంజీవి స్వయంగా ప్రత్యేక విమానంలో కేరళకు వెళ్లి చెక్ ను అందజేసారు.
కేరళలోని వాయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపం కారణంగా 400 మందికి పైగా మృత్యువాతపడడం తెలిసిందే. వాయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది గల్లంతు కావడం అందరినీ కదలించింది. సహాయక కార్యక్రమాల్లో మలయాళ నటుడు మోహన్ లాల్ కూడా స్వయంగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇంకా మరెంతో మంది సెలబ్రిటీలు సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయనాడ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటన అనంతరం సెలబ్రిటీలంతా పెద్ద ఎత్తున ముందుకొచ్చి విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా అన్నిపరిశ్రమల నటులు ఆపత్కాలంలో సహాయం అవసరం మని గుర్తించి వెంటనే విరాళాలు ప్రకటించారు. ప్రభాస్ , అల్లు అర్జున్ , సూర్య, ఎన్టీఆర్, కమల్ హాసన్, విక్రమ్, నయనతార, విశాల్, కార్తీ , పహాద్ పాజిల్, రష్మిక మందన ఇలా చాలా మంది సెలబ్రిటీలు సీఎం రిలీఫ్ పండ్ విరాళాలు ప్రకటించారు.