అందరూ ఆ డేట్ కోసమే ఎగబడితే ఎలా?
ఈ సినిమాకి ఎదురెళ్ళడం కష్టం అని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నిర్మాతలందరికీ తెలుసు. దర్శకులు కూడా సలార్ కి పోటీగా తమ సినిమాలు రిలీజ్ చేసే ధైర్యం చేయలేరు
డిసెంబర్ నెలలో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నాయి. మినిమమ్ రేంజ్ మూవీస్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వరకు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. డిసెంబర్ 1న యానిమల్ సినిమాతో ఆ నెలలో సినిమాల తాకిడీ మొదలు కాబోతోంది. తరువాత ప్రతి వారం మూవీస్ రిలీజ్ అవుతూనే ఉండటం విశేషం. అయితే డిసెంబర్ 8 మాత్రం చాలా ప్రత్యేకం అని చెప్పాలి.
డిసెంబర్ 22న డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి ఎదురెళ్ళడం కష్టం అని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నిర్మాతలందరికీ తెలుసు. దర్శకులు కూడా సలార్ కి పోటీగా తమ సినిమాలు రిలీజ్ చేసే ధైర్యం చేయలేరు. అంతగా సలార్ మూవీ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ముందు వారం సినిమాలు రిలీజ్ చేసిన కచ్చితంగా మొదటి వారం తర్వాత సూపర్ హిట్ టాక్ వచ్చిన కలెక్షన్స్ కచ్చితంగా డ్రాప్ అయిపోతాయి.
అందుకే సేఫ్ జోన్ గా డిసెంబర్ 8న రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ డేట్ కోసం ఇప్పుడు కాంపిటేషన్ ఎక్కువైపోయింది. వరుణ్ తేజ్ తెలుగు, హిందీ భాషలలో చేస్తోన్న ఆపరేషన్ వాలంటైన్ మూవీ డిసెంబర్ 8న రిలీజ్ కానుంది. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అదే రోజు థియేటర్స్ లోకి రాబోతోంది.
బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మాణంలో సిద్ధార్ద్ మల్హోత్రా చేస్తోన్న పాన్ ఇండియా మూవీ యోదాని డిసెంబర్ 15న రిలీజ్ చేద్దామని అనుకున్న ఒక వారం ముందుకి తీసుకొస్తున్నారు. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ లీడ్ రోల్ లో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కిస్తున్న మేరీ క్రిస్మస్ మూవీని కూడా డిసెంబర్ 8కి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. వీటితో పాటుగా నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీని కూడా డిసెంబర్ 7, 8 తేదీలలో ఏదో ఒక రోజు కన్ఫర్మ్ చేయాలని అనుకుంటున్నారు.
మొత్తానికి డిసెంబర్ 8కి అయితే సినిమాల మధ్య పోటీ గట్టిగానే ఉండబోతోంది. పాన్ ఇండియా కల్చర్ పెరిగిన తర్వాత అన్ని భాషల నుంచి సినిమాలు డబ్బింగ్ రూపంలో ఇతర భాషలలో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇది కూడా సినిమాల రిలీజ్ విషయంలో కాంపిటేషన్ పెరగడానికి ఒక కారణం అయ్యిందని చెప్పొచ్చు.