దీపికా పదుకొణే టాలీవుడ్ అలా కోల్పోయిందా?
ఆ జోడీని తెరపై చూడాలని తెలుగు ప్రేక్షకులు అంతే ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే 'కల్కీ 2898' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పాన్ ఇండియా స్టార్ సరసన ప్రభాస్ సరసన నటిస్తుంది. డార్లింగ్ పక్కన దీపిక జోడీ చూడముచ్చటగా ఉంటుంది? అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా దీపిక మాత్రమే సరితూగుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఆమెని ఎంపిక చేసాడు. ఆ జోడీని తెరపై చూడాలని తెలుగు ప్రేక్షకులు అంతే ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. మరో రెండు నెలల్లో ఆ కోరిక తీరబో తుంది.
మేలో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అందరి ఉత్సాహానికి తెరపడనుంది. ఆ రకంగా దీపిక ఎంట్రీ టాలీవుడ్ లో 2024 లో షురూ అవుతుందని తెలుస్తుంది. కానీ అమ్మడు తెలుగు పరిశ్రమకు ఇప్పుడు కాదు..ఎప్పుడో పరిచయం కావాల్సి ఉందన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఛాన్స్ తీసుకుంది జయంత్ సి. పరాన్జీ. అవును ఆయన దర్శకత్వంలో రణదీప్..మృదుల జంటగా 'లవ్ 4 ఎవర్' అనే ఓ సినిమా తెరకెక్కింది. అందులో ఓ ప్రత్యేక గీతంలో దీపికా పదుకొణే నటించారుట.
కానీ ఆ సినిమా అనివార్య కారణాలతో రిలీజ్ ఆగిపోయింది. దీంతో దీపిక టాలీవుడ్ ఎంట్రీకి అప్పుడు అలా బ్రేక్ పడింది. లేదంటే? అమ్మడు కొన్నేళ్ల క్రితమే టాలీవుడ్ లో లాంచ్ అయ్యేదే. అయితే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కాకపోవడం దీపికకు కలిసొచ్చిన అంశమే. అప్పటికి దీపికా పదుకొణే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కాదు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడమో.. లేదంటే కొన్ని సినిమాలు చేసినా సరైన గుర్తింపు రాని సమయం కావచ్చు.
కానీ ఇప్పుడు దీపిక పదుకొణే అంటే అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన నటి. ఇప్పుడదే హోదాలో టాలీవుడ్ లో లాంచ్ అవుతుంది. కల్కిలో అవకాశం రావడానికి కారణం కూడా ఆమె స్టార్ డమ్. లేదంటే ఈ ఛాన్స్ మరో హీరోయిన్ తీసుకునేది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అదీ లెక్క. 'కల్కీ' హిట్ అయితే దీపిక పాన్ ఇండియా రేంజ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది? అన్నది అంతే వాస్తవం.