దేవర హిందీ లెక్కల సంగతేంటి?
మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర పార్ట్-1 రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర పార్ట్-1 రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సందడి చేయనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలే ఉన్నాయి. మేకర్స్ వాటిని మరింత పెంచే కంకణం కట్టుకున్నారు! పక్కా ప్లాన్ తో ప్రమోషన్స్ చేపడుతూ పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్సెస్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఆయుధ పూజ సాంగ్ ను విడుదల చేయనున్నారు మేకర్స్. రీసెంట్ గా సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దానితో సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశారు. ఒక్కో కంటెంట్ తో సినీ ప్రియులతో పాటు తారక్ అభిమానుల్లో ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేస్తున్నారు. దీంతో దేవర పార్ట్-1 కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
అయితే సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయనున్న మేకర్స్.. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేస్తున్నారు. థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు టాక్. తెలుగు రాష్ట్రాల్లో రూ.113 కోట్లకు పైగా జరిగినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్ల మేరకు ప్రీ బిజినెస్ జరిగింది. కానీ ఇప్పుడు చర్చంతా నార్త్ బిజినెస్ పైనే. మరో ఐదు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్నా.. అసలు క్లారిటీ రావడం లేదు!
హిందీ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ భారీ మొత్తానికి దక్కించుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ రూ.15 కోట్లకు దేవర థియేట్రికల్ రైట్స్ (నార్త్) డీల్ సెట్ అయిందని ఇప్పుడు తెలుస్తోంది. అంటే ఉత్తరాది దేవరలో రూ.30-35 కోట్ల షేర్ వసూళ్లు సాధిస్తే చాలు.. మూవీ హిట్ అయినట్లే. అయితే దేవర మేకర్స్.. బీ టౌన్ లో ప్రమోషన్స్ భారీగా చేపట్టారు. వివిధ ఇంటర్వ్యూలతో నార్త్ సినీ ప్రియుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.
దీంతో అక్కడ దేవర.. రూ.8-10 కోట్ల మధ్య ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని అంతా అంచనా వేస్తున్నారు. ఒకవేళ రూ.5-6 కోట్ల మధ్య ఓపెనింగ్స్ వచ్చినా.. పాజిటివ్ మౌత్ అందుకుంటే.. ఇక తిరుగులేదు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకోవడమే కాదు.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. భారీ వసూళ్లను కచ్చితంగా సాధిస్తుంది. సూపర్ హిట్ గా నిలుస్తుంది. మరేం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజుల పాటు వేచి చూడాలి.