దేవర బెన్ ఫిట్ షోలు.. బ్లాస్ట్ అయ్యేలా రేట్లు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Update: 2024-09-23 08:06 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. కచ్చితంగా ‘దేవర’ మూవీ మొదటి రోజే 150 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ చిత్ర యూనిట్ స్ట్రాంగ్ గా చేస్తోంది. సెప్టెంబర్ 22న ప్రీరిలీజ్ ఈవెంట్ అనుకున్నారు. అయితే క్రౌడ్ ఎక్కువ రావడంతో నోవోటెల్ లో జరగాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది.

ఇదిలా ఉంటే ‘దేవర’ మూవీ టికెట్ ధరలు పెంచుకోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే పర్మిషన్ ఇచ్చాయి. అలాగే ఐదు షోలకి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీంతో మొదటి 10 రోజులు తెలుగు రాష్ట్రాలలో ‘దేవర’ మూవీ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణాలో ‘దేవర’ మూవీ స్పెషల్ బెన్ ఫిట్ షోలు వేయడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు. వీటికోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అర్ధరాత్రి 1 గంటకి లేదంటే 4 గంటలకి ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఈ బెన్ ఫిట్ షోలు వేయాలని అనుకుంటున్నారంట. వీటిని చారిటీ షోలుగా ప్రకటించి ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసం మాత్రమే వేస్తారు. గతంలో ఇలాంటి బెన్ ఫిట్ షోలు ఎక్కువ వేసేవారు. తరువాత కాలంలో తగ్గిపోయాయి. మరల దేవర బెన్ ఫిట్ షో కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో 6 థియేటర్స్ లో ఈ షోలు వేయడానికి పర్మిషన్స్ లభించినట్లు టాక్ వినిపిస్తోంది.

మేగ్జిమమ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లోనే ఈ బెన్ ఫిట్ షోలు వేయనున్నారు. మల్టీ ప్లెక్స్ లలో అయితే టికెట్ ధరలో సగం థియేటర్స్ వారికి వెళ్లిపోతాయి. అందుకే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లోనే ‘దేవర’ బెన్ ఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఈ బెన్ ఫిట్ షోల టికెట్ ధరలు బయట 3 వేల నుంచి 3,500 వందల మధ్యలో పలుకుతున్నాయని టాక్ నడుస్తోంది. ఇంకా ఎక్కువ ధరకి కూడా అమ్ముడయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

బుధవారం ఈ బెన్ ఫిట్ షోల గురించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే బెన్ ఫిట్ షోలు వేసే థియేటర్స్ లిస్ట్ కూడా అదే రోజు ఎనౌన్స్ చేయొచ్చని అంటున్నారు. అలాగే బెన్ ఫిట్ షోల టైమింగ్ పైన కూడా మేకర్స్ ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని టాక్ నడుస్తోంది.

Tags:    

Similar News