దేవర ఓవర్సీస్ టార్గెట్ ఎంతంటే?

ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి పాన్ రాబోతున్న మూవీ ఇదే కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి.

Update: 2024-08-16 06:18 GMT

కల్కి 2898ఏడీతో ఈ ఏడాది టాలీవుడ్ కి అతిపెద్ద సక్సెస్ లభించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1150+ కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ టాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ సెన్సేషన్ మూవీ దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతోంది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి పాన్ రాబోతున్న మూవీ ఇదే కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి.

కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు దేవర సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. దేవర మూవీ మరల డిస్టిబ్యూటర్స్, బయ్యర్లకి భారీ లాభాలు తీసుకొస్తుందని భావిస్తున్నారు. సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ కి కూడా మంచి ఆదరణ లభించింది. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తూ ఉండటంతో తమిళనాట కూడా దేవర మూవీపైన క్రేజ్ నెలకొని ఉంది.

ఇప్పటికే ఈ మూవీ బిజినెస్ డీల్స్ క్లోజ్ అయిపోయాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాపై 110 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అలాగే హిందీ రైట్స్ 60 కోట్లకి అమ్ముడయ్యాయంట. డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ 155 కోట్లకి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ రైట్స్ 27 కోట్లకి సోల్డ్ అయ్యాయంట. ఓవరాల్ గా అన్ని భాషలు కలుపుకొని థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ 350+ కోట్ల వరకు జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

ఓవర్సీస్ లో 27 కోట్ల బిజినెస్ అంటే 4 మిలియన్ డాలర్స్ వరకు ఈ మూవీ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ ఇమేజ్ పరంగా చూసుకుంటే ఇది పెద్ద టార్గెట్ అయితే కాదు. మొదటి రోజే 1-2 మిలియన్ డాలర్స్ మధ్యలో కలెక్షన్స్ దేవర మూవీ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాకి హిట్ టాక్ వస్తే భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. కల్కి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో లార్జర్ దెన్ లైఫ్ మూవీగా దేవర ఉంది.

ఈ నేపథ్యంలోనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే రిలీజ్ కి ముందే టేబుల్ టేబుల్ ప్రాఫిట్ తో దేవర సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోందని ఈ సినిమా బిజినెస్ బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేసింది. వీరిద్దరి ఇమేజ్ కూడా హిందీ బెల్ట్ లో సినిమాకి ఎంతో కొంత హైప్ తీసుకొస్తుందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News