దేవి.. మరొకటి చేజారిందా?

తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాని ఏకకాలంలో రిలీజ్ చేయాలనే ఆలోచనతోనే మేకర్స్ ఉన్నారు.

Update: 2024-11-28 11:30 GMT

తమిళంలో అజిత్ హీరోగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఫెస్టివల్ కానుకగా కోలీవుడ్ నుంచి ఓ ఒక్క సినిమానే పోటీలో ఉండబోతోంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాని ఏకకాలంలో రిలీజ్ చేయాలనే ఆలోచనతోనే మేకర్స్ ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే రీసెంట్ గా పుష్ప 2 పాట్నా ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేజ్ మీద అందరి ముందుగానే నిర్మాతపై అసహనం వ్యక్తం చేశాడు. ఇక ఏమైందో ఏమో గాని సడన్ గా ‘గుడ్ బ్యాగ్ అగ్లీ’ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో నిర్మాతలు దేవిశ్రీ ప్రసాద్ ని కొనసాగించడానికి ఆసక్తి చూపించలేదనే మాట వినిపిస్తోంది. ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం జీవీ ప్రకాష్ కుమార్ ని ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ విషయాన్ని జీవీ ప్రకాష్ కుమార్ కూడా ధృవీకరించాడు. ఈ ఏడాది జీవీ ప్రకాష్ కుమార్ తాను హీరోగా నటించిన ‘డియర్’ మూవీతో పాటు హిందీలో ‘సర్ఫిరా’, ‘తంగలాన్’, ‘అమరన్’, ‘లక్కీ భాస్కర్’, ‘మట్కా’ సినిమాలకి మ్యూజిక్ అందించాడు. వీటిలో ‘తంగలాన్’ ఏవరేజ్ టాక్ తెచ్చుకుంటే ‘అమరన్’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాలు కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. ‘మట్కా’ పెద్దగా మెప్పించలేదు. అయితే ‘అమరన్’, ‘లక్కీ భాస్కర్’ సక్సెస్ తో జీవీ ప్రకాష్ ఫేమ్ కూడా పెరిగింది.

ఈ కారణంగానే మరల అతనికి అవకాశాలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అతని చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అతనికే వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సాంగ్స్ ఇప్పటికే ఇచ్చేసారు. మూవీ రిలీజ్ దగ్గర పడుతోంది. అందుకే సాంగ్స్ వరకు మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ ని మైత్రీ మూవీ మేకర్స్ పరిమితం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో అనుకుంటున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం పుష్ప 2 కాకుండా నాగ చైతన్య ‘తండేల్’ కూడా చేస్తున్నాడు. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ అయితే మరల అతనిని ఎవరు అడ్డుకోలేరని ఫ్యాన్స్ అంటున్నారు. ఏదైనా ముఖం మీద మాట్లాడే అలవాటు దేవిశ్రీ ప్రసాద్ కి ఉందని, అందుకే ఓపెన్ గా ‘పుష్ప 2’ ఐటెం సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో అలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకుంటున్నారు. అయితే ఇటీవల రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ లో మైత్రి రవి దేవితో ఎలాంటి ప్రాబ్లం లేదని అన్నారు. మరి ఇంతలో అజిత్ సినిమా నుంచి ఎందుకు తప్పించారు అనేది మిస్టరీగా మారింది.

Tags:    

Similar News