విడాకులను వాయిదా వేసుకున్న స్టార్ కపుల్.. తెరవెనక షాడో అతడు!
పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్న జంట విడిపోవడం అంటే అది ఎంత బాధాకరమైనదో ఊహించగలం.
పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్న జంట విడిపోవడం అంటే అది ఎంత బాధాకరమైనదో ఊహించగలం. కానీ అలాంటి బాధాకరమైన నిర్ణయం తీసుకున్నారు ధనుష్- ఐశ్వర్య జంట. ఈ నిర్ణయం ఇరువైపులా కుటుంబ సభ్యుల్లో ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా కుమార్తె- అల్లుడు పరస్పరం విడిపోవడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతగా కలత చెందారో అర్థం చేసుకోవచ్చు.
మొదటి నుంచి ఆ ఇద్దరినీ కలిపి ఉంచేందుకు రజనీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసారని కథనాలొచ్చాయి.
2022లో విడిపోయిన ఈ జంట మొదట చెన్నై ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ జంట విడిపోకుండా ఉండాలని గట్టి సంకల్పంతో రజనీ వారిని సముదాయించారని, దీంతో ఇరు పక్షాలు కోర్టు ఇచ్చిన తేదీలను వదులుకోవడంతో విచారణ పదే పదే వాయిదా పడిందని కూడా తెలుస్తోంది. గత నెల రెండు తేదీలు అలాగే నవంబర్ 2 తేదీల్లో వారు గైర్హాజరైన తర్వాత ఈ విచారణ నవంబర్ 21కి షెడ్యూల్ చేసారని సమాచారం. ఇప్పటికే మూడుసార్లు వారి విడాకుల విచారణ తేదీలు వాయిదా వేయడం దేనికి సూచిక?
ధనుష్ - ఐశ్వర్య జంట ఇప్పుడు మనసు మార్చుకున్నారు. సయోధ్య వైపు ఆలోచిస్తున్నారని కూడా గుసగుస వినిపిస్తోంది. ఇటీవల ఓనం జరుపుకుంటున్న ఐశ్వర్య సోషల్ మీడియా పోస్ట్‌ను ధనుష్ అంగీకరించిన తర్వాత ఆ ఇద్దరూ తిరిగి కలుస్తున్నారని అంతా ఊహించారు. రజనీకాంత్ పోయెస్ గార్డెన్ నివాసంలో పిల్లలతో కలిసి ధనుష్-ఐశ్వర్య జంట దీపావళి వేడుకలను జరుపుకోవడంతో ప్రజలకు చాలా వరకూ క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ జంట విడివిడిగా ఉండరు.. నిర్ణయం మార్చుకున్నారు.. పిల్లల కోసం అయినా కలిసే ఉంటారని అంతా భావిస్తున్నారు.
సూపర్ స్టార్ ఇంట దీపావళి కొత్త వెలుగులు నింపిందని, ఆ రోజు అల్లుడితో రజనీ చర్చలు జరిపారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ధనుష్ తదుపరి శేఖర్ కమ్ములతో కుభేర విడుదల కోసం సన్నాహకాల్లో ఉన్నారు. స్వీయ దర్శకత్వంలో నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్‌ని పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు ధనుష్ సన్నాహకాల్లో ఉన్నారు. ఐశ్వర్య `లాల్ సలామ్` పరాజయం తర్వాత మరో చిత్రానికి దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నట్టు లేదు.