దేశ రాజ‌ధానిలో మొద‌లైన ప్రేమ కావ్యం!

ప్రేమలో విఫ‌ల‌మైన ఓ జంట క‌థ‌ను చూపించ‌బోతున్నారు. ఇది వాస్త‌వ జీవితంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఆధారంగా తీస్తున్నారు.

Update: 2025-02-17 06:06 GMT

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ బ్యూటీఫుల్ ల‌వ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో `తేరే ఇష్క్ మే` చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. బ్యూటీఫుల్ రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా దీన్ని తెర‌పైకి తెస్తున్నారు. ఈ కాంబినేష‌న్ లో సినిమా అన‌గానే అంచ‌నాలు తారా స్థాయికి చేరాయి. తాజాగా ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ప్రేమలో విఫ‌ల‌మైన ఓ జంట క‌థ‌ను చూపించ‌బోతున్నారు. ఇది వాస్త‌వ జీవితంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఆధారంగా తీస్తున్నారు. ఇందులో ముక్తి అనే అమ్మాయి పాత్ర‌లో కృతి స‌న‌న్ క‌నిపించ‌నుంది. ప్రేమ కోసం అబ్బాయిలే ప్రాణాలిస్తారా? అమ్మాయిల్లో కూడా ఆధైర్య ఉందంటూ? కొత్త పాయిట్ ని ట‌చ్ చేస్తూ తేరే ఇష్క్ మేని ప్ర‌క‌టించారు. ఈ సినిమాకు రెహ‌మాన్ సంగీతం అందించ‌డం మ‌రో అద‌నపు అస్సెట్ అని చెప్పాలి.

ఇలాంటి ల‌వ్ స్టోరీల విష‌యంలో రెహ‌మాన్ బాణీలు నెక్స్ట్ లెవ‌ల్లోనే ఉంటాయ‌ని ఊహించొచ్చు. ఆయ‌న కూడా ప్రేమ క‌థ‌ల‌కు సంగీతం అందించి చాలా కాల‌మ‌వుతుంది. ఈ సినిమాతో మ‌రోసారి హృదయాన్ని హ‌త్తుకునే బాణీలు స‌మ‌కూరుస్తార‌ని శ్రోత‌లు ఆశిస్తున్నారు. ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీ కావ‌డంతో? రెహమాన్ ది బెస్ట్ మ్యూజిక్ అందిస్తాడ‌ని అంతా ఆశిస్తున్నారు. ధ‌నుష్- ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేష‌న్ లో మూడ‌వ చిత్ర‌మిది.

ఇప్ప‌టికే ఈ కాంబోలో రిలీజ్ అయిన `రాంఝానా`, `ఆంత్రంగిరే` సంచ‌ల‌నం విజ‌యాలు సాధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో బాలీవుడ్ లో ధ‌నుష్ కి ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. ధ‌నుష్ తో ఆనంద్ తీసిన రెండు సినిమాల విష‌యంలో రొమాంటిక్ అంశాలు ఎక్క‌డా ట‌చ్ చేయ‌లేదు. ఆ స్టోరీ లు డిమాండ్ చేయ‌క‌పోవ‌డంతో వాటి జోలికి ఆనంద్ వెళ్లలేదు. కానీ `తేరే ఇష్క్ మే` మాత్రం ఆ రెండు సినిమాల‌కు భిన్న‌మైన చిత్రం.

Tags:    

Similar News