ప్రభాస్.. ఒక్క మాటకు ఇంత రచ్చా..
ప్రభాస్ సాధారణంగా తన పర్సనల్ లైఫ్ విషయాలను బాహ్య ప్రపంచంలో చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడడు.
ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకే ఒక్క పోస్టుతో సోషల్ మీడియాలో ఊహించని అలజడి క్రియేట్ చేసాడు. ఈరోజు ఉదయం ఇన్స్టాగ్రామ్ లో తన లైఫ్ లోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నాడు అని అర్థం వచ్చేలా స్టోరీ యాడ్ చేసిన ప్రభాస్ అందరికీ ఒక్కసారిగా షాక్ అయితే ఇచ్చాడు. ప్రభాస్ సాధారణంగా తన పర్సనల్ లైఫ్ విషయాలను బాహ్య ప్రపంచంలో చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడడు.
కానీ ఈసారి అతను అదే అర్థం వచ్చేలా రియాక్ట్ కావడం తో ఊహించిన విధంగా ఈ విషయం ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. సోషల్ మీడియా నుంచి మీడియా న్యూస్ ఛానల్ వరకు ఇది బ్రేకింగ్ న్యూస్ గా మారిపోయింది. ప్రభాస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఆ స్పెషల్ పర్సన్ ఎవరు అనే విషయంలో అనేక రకాల బులిటెన్స్ కూడా వస్తూ ఉండడం మరింత వైరల్ గా మారుతుంది.
దీంతో ఈ విషయంపై ఓ వర్గం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ తన పర్సనల్ లైఫ్ గురించి ఈ విధంగా హడావిడి చేయడానికి ఏమాత్రం ఇష్టపడడు. ఇన్ని రోజులు లేని పెళ్లి టాపిక్ ఇప్పుడే సడన్ గా ఎందుకు వస్తుంది అని కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు.
మరి కొన్ని రోజుల్లో కల్కి సినిమా విడుదల కాబోతోంది. ఈ టైమ్ లో ఆ సినిమాకు సంబంధించిన విషయాలు కాకుండా ప్రభాస్ వేరే విషయాల గురించి ఎలా ఆలోచిస్తాడు అని మరికొందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ప్రభాస్ చేసిన పోస్ట్ మాత్రం కల్కి సినిమాకు సంబంధించినదే అయ్యుంటుందని అంటున్నారు.
మళ్ళీ ఏదో ఒక రకంగా ప్రభాస్ ఆ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఒక అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందని ఈ విషయం గురించి అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని మరి కొందరు అంటున్నారు. కానీ మీడియా న్యూస్ ఛానల్స్ మాత్రం ప్రభాస్ పెళ్లి అన్నట్లుగానే వివిధ రకాల కథనాలను వైరల్ చేస్తూ ఉండడం కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. ఇక చివరికి ప్రభాస్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మరికొన్నీ కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ విషయంలో ప్రభాస్ నెక్స్ట్ సోషల్ మీడియాలో చేసే పోస్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.