షాక్‌.. పాడుతా తీయగాలో కిరణ్‌ 'దిల్‌రుబా'

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు 'పాడుతా తీయగా' కార్యక్రమంను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.;

Update: 2025-03-05 11:01 GMT

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు 'పాడుతా తీయగా' కార్యక్రమంను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. రెండు దశాబ్దాలకు పైగా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఈటీవీలో ఈ పాటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంతో పాటు స్వరాభిషేకం ఇంకా కొన్ని పాటల కార్యక్రమాలు సైతం ఎస్పీబీ ఈటీవీ కోసం నిర్వహించారు. టాలీవుడ్‌కి పరిచయం అయిన సింగర్స్‌లో అత్యధికులు పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొన్న వారు ఉంటారు. అక్కడ గుర్తింపు లభిస్తే సినిమాల్లో పాడే అవకాశం లభిస్తుందనే నమ్మకం ఉండేది. అందుకే పాడుతా తీయగా ప్రతి సీజన్‌లో కంటెస్ట్‌ చేయడం కోసం ఎంతో మంది సింగర్స్ పోటీ పడేవారు.

తెలుగులో ఎన్ని సింగింగ్ కాంపిటీషన్ షోలు వచ్చినా అన్నీ కూడా పాడుతా తీయగా తర్వాతే అనడంలో సందేహం లేదు. కరోనా సమయంలో ఎస్పీ బాలు గారు చనిపోయినప్పటికీ ఆ కార్యక్రమంను కొనసాగుతూనే ఉంది. ఆయన చనిపోయే వరకు ఆ షో కొనసాగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఎస్పీ చరణ్‌ పాటల కార్యక్రమం పాడుతా తీయగాను కొనసాగిస్తున్నారు. పాతిక ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పాడుతా తీయగా కార్యక్రమంలో ఎప్పుడు ఏ ఒక్క సినిమా ను గురించి కానీ, ఏ ఒక్క వ్యక్తిని ప్రమోట్‌ చేయడం కానీ జరగలేదు. కానీ మొదటి సారి పాడుతా తీయగా కమర్షియల్‌ టర్న్‌ తీసుకుంది.

బాలు గారు చనిపోయిన తర్వాత కూడా ఎస్పీ చరణ్‌ షో ను కొనసాగిస్తున్నాడు. షో ను అభిమానించే కొందరు ఇష్టం లేకుండానే షోను చూస్తున్నారు. కొందరు బాలు గారి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం కోసం షో ను చూస్తూ ఉన్నారు. పాతికేళ్లుగా ఎప్పుడూ ఏ సినిమాను ప్రమోట్‌ చేయని పాడుతా తీయగా షో లో మొదటి సారి ఒక సినిమాను ప్రమోట్‌ చేయబోతున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'దిల్‌రుబా' సినిమా ఈనెల 14న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా దిల్‌రుబా చిత్ర యూనిట్‌ సభ్యులు పాడుతా తీయగా స్టేజ్‌పై సందడి చేశారు. సినిమా విశేషాలను ఆ స్టేజ్‌పై, ఆ షో లో పంచుకున్నారు.

ఈటీవీలో వచ్చే వారంలో ప్రకారం కాబోతున్న పాడుతా తీయగా కార్యక్రమంలో దిల్‌రుబా టీం మెంబర్స్ కనిపించబోతున్నారు. కేవలం యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంతో షో లను నడిపించడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం ఇలా చేయడం కంటే బాలు గారి పరువు నిలబెట్టే విధంగా షో ను ఆపేస్తే బాగుంటుంది కదా అంటూ ఎస్పీ చరణ్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా దిల్‌రుబా టీంతో ప్రమోషన్‌ చేసిన పాడుతా తీయగా టీం అది సక్సెస్‌ అయితే ఇక మీదట రాబోయే అన్ని షో ల్లోనూ సినిమాలను ప్రమోట్‌ చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.

Tags:    

Similar News