బేబీ కాపీనా.. దర్శకుడి ఓపెన్ ట్విస్ట్
అసలేం జరిగిందంటే.. 'బేబి' చిత్రాన్ని తన స్టోరీని దొంగిలించి సినిమా తీశారంటూ దినేశ్ కుమార్ డీకే అనే వ్యక్తి సోషల్‌మీడియాలో ట్వీట్ చేశారు
ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ సెన్సేషన్‌గా నిలిచిన సినిమా 'బేబీ'. చిన్న సినిమాగా రిలీజై కల్ట్ క్లాసిక్ హిట్‌గా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. రెండు వారాల్లోనే దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ వరకు అందుకుని సినీ విశ్లేషకులను షాక్‌కు గురి చేసింది. ఆఖరికి వీక్ డేస్‌లోనూ హౌస్ ఫుల్స్‌తో నడుస్తూ సెన్సేషనల్ క్రియేట్ చేసింది.
అయితే ఇప్పుడీ సినిమా కాపీ అంటూ ప్రచారం మొదలైంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమా కాపీ అంటూ ప్రేక్షకులకు చెప్పింది చిత్ర దర్శకుడు సాయి రాజేషే కావడం గమనార్హం.
అసలేం జరిగిందంటే.. 'బేబి' చిత్రాన్ని తన స్టోరీని దొంగిలించి సినిమా తీశారంటూ దినేశ్ కుమార్ డీకే అనే వ్యక్తి సోషల్‌మీడియాలో ట్వీట్ చేశారు. బేబీ మూవీ కాపీ అంటూ రాసుకొచ్చారు. 2012లోనే తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు,ప్రేమకథ ఆధారంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్క్రిప్ట్‌ను రాయడం మొదలుప్టటినట్టు తెలిపిన డీకే.. 2018లో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలిపారు.
ఆ తర్వాత పలు భాషల్లోని నిర్మాతలను కలిసి కథ కూడా చెప్పినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే కొందరికి స్క్రిప్ట్‌ను కూడా ఇచ్చారట. కానీ ఇప్పుడు టాలీవుడ్లో ఆ కథతోనే సినిమా తీశారని ఆరోపించాడు.
అయితే ఈ పోస్ట్‌ను ఒక తమిళ క్రిటిక్ షేర్ చేశారు. దాన్ని స్క్రీన్ షాట్ తీసిన దర్శకుడు సాయి రాజేశ్.. తన సోషల్‌మీడియా అకౌంట్ ద్వారా దీన్ని పంచుకున్నారు. అలాగే కొన్ని మీడియా సంస్థలకు కూడా ట్యాగ్ చేసి దీని మీద వార్తలు రాయడం అంటూ సూచనలు చేశారు.
కాగా, చిత్రసీమలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. పలు హిట్ సినిమాల విషయంలో ఇలాంటి ఆరపణలు వస్తూనే ఉంటాయి. కొంతమంది కావాలని ట్రెండ్ అవ్వాలని ఇలా చేస్తుంటారు. మరి కొన్ని సందర్భాల్లో కాకతాళీయంగా జరుగుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికే.. బేబీ దర్శకుడు సాయి రాజేశ్.. ఈ సినిమా తమిళనాడులోని సేలంలో జరిగిన ఒక ఉదంతం స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించినట్లు ఇప్పటికే తెలిపారు.