పార్కింగ్ ప్లేస్‌లో పటానీ ఇలా ఆరబోసిందేమిటీ?
సీకే బ్యూటీగా పాపులరైన ఈ అమ్మడు నిరంతరం పాపులర్ బ్రాండ్ ప్రచారం పేరుతో అభిమానులకు అన్ లిమిటెడ్ ట్రీటిస్తోంది.
తనవైన మత్తందాలు, బోల్డ్ కంటెంట్ తో కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటివ్వడం ఎలానో దిశాపటానీకి తెలిసినంతగా మరెవరికీ తెలీదేమో! సీకే బ్యూటీగా పాపులరైన ఈ అమ్మడు నిరంతరం పాపులర్ బ్రాండ్ ప్రచారం పేరుతో అభిమానులకు అన్ లిమిటెడ్ ట్రీటిస్తోంది.
వీలున్న ప్రతి వేదికపైనా దిశా తన అందచందాలను ప్రదర్శించడంలో వెనక్కి తగ్గదు. మీడియా ఎదుట ప్రచార వేదికలపైనా ఈ అమ్మడి తెగువ ఎప్పటికీ యూనిక్. ఇటీవల దిశా పటానీ వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తోంది. అది కూడా సౌత్ లో వరస చిత్రాలకు సంతకాలు చేస్తోంది. ప్రభాస్ సరసన కల్కి 2989 ఏడిలో నటించిన దిశా పటానీ, ఇప్పుడు తమిళ అగ్ర హీరో సూర్యతో కలిసి `కంగువ`లో కనిపించనుంది. కంగువ హిందీ బెల్ట్ లోను అత్యంత భారీగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఉత్తరాది ఆడియెన్ ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.
కంగువ తారాగణం ముంబైలో ఈరోజు భారీ ప్రచార వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా సూర్య , బాబీ డియోల్‌లతో కలిసి దిశా పటాని అక్కడ ప్రత్యక్షమైంది. డీప్ నెక్‌లైన్‌తో కర్వీ బ్రౌన్ మ్యాక్సీ డ్రెస్‌లో దిశా షో స్టాపర్ గా నిలిచింది. ముఖ్యంగా దిశా ఎంపిక చేసుకున్న బాడీకాన్ దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఫ్రీ అండ్ ఫ్లో బాడీకాన్ ఫ్రాక్ లో దిశా పటానీ తన అందాలను బోల్డ్ గా ఎలివేట్ చేసింది.
ఈ వేదికపై దిశా మాట్లాడుతూ... ``నేను చాలా అద్భుతమైన వ్యక్తులు, నమ్మశక్యం కాని దర్శకుడు, గొప్ప నటులతో కలిసి పని చేసాను. ఆరంభం వర్క్ షాప్ కి హాజరయ్యాను. మేం సెట్‌లో ఒక చిన్న కుటుంబంలా కలిసిపోయాం. వారు నన్ను జాగ్రత్తగా.. సౌకర్యవంతంగా ఉండేలా చూసుకున్నారు. శివా సార్.. ఆయన మా టెడ్డీ! అతడు నాకు తెలిసిన అత్యంత మృధువైన వ్యక్తి. ఆయన కనిపించే దానికి భిన్నంగా సినిమాలు చేస్తున్నారు. శివ చాలా దయగల వ్యక్తి. చాలా సౌమ్యుడు. నేను అతడిని మొదటిసారి కలుసుకున్నప్పుడు `నా నటీనటులు సెట్‌కి వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలి` అని చెప్పారు. ప్రతిరోజూ సంతోషంగా పని చేసేలా చూసుకున్నారు.. అని తెలిపింది.
సూర్య ఈ సినిమాలో మొత్తం 13 విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రం అతడి కెరీర్‌లో ఒక ప్రత్యేక చిత్రంగా నిలవనుంది. నటన పరంగా అతడికి ఇది మరో లెవల్ అని తెరపై చూశాక తెలుస్తుంది. ఈ కథ గతం వర్తమానం, భవిష్యత్తు అనే మూడు అంశాలను స్పర్శిస్తూ, విభిన్న యుగాలలో నడుస్తుంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ ని దీని కోసం ఉపయోగించారు.