డబుల్ ఇస్మార్ట్ 'బిగ్ బుల్'.. మున్నా భాయ్ దిగాడురోయ్..

ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో బిగ్ బుల్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు

Update: 2023-07-29 03:57 GMT

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈసారి ఎలాగైనా రామ్ తో బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందుకోవాలి అని రెడీ అవుతున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ కలవడంతో అంచనాలు గట్టిగానే పెరిగిపోయాయి. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ ఇటీవల షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే.




 


ఇక సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చిత్రం యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ప్రతి షెడ్యూల్లో కూడా ఒక ప్రత్యేకమైన అప్డేట్ తో సినిమాపై అంచనాలు పెరిగేలా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు మొత్తానికి ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా కనిపించిన సంజయ్ దత్ కేజిఎఫ్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో మరింత క్రేజ్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో బిగ్ బుల్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ఒక పోస్టర్ను విడుదల చేసింది.

అందులో సంజయ్ స్మోకింగ్ చేస్తూ ఉండగా అతన్ని టార్గెట్ చేసినట్లు హైలెట్ చేశారు. చూస్తుంటే పవర్ఫుల్ లుక్ తో సంజయ్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల ముంబైలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసిన దర్శకుడు పూరి పక్క ప్రణాళికతోనే సినిమాను ఈ ఏడాదిలోనే ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక సినిమాను మహాశివరాత్రి సందర్భంగా మార్చి 14వ తేదీన రిలీజ్ చేయాలనే ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు.

ఇక పూరి తో పాటు ఈ సినిమా నిర్మాణంలో చార్మి కూడా భాగం కానున్న విషయం తెలిసిందే. ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈసారి కూడా పూరి ఇద్దరు హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పూరి ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News