డబుల్ ఇస్మార్ట్ డబ్బుల టెన్షన్.. ఏమవుతుందో..?
ఇద్దరికీ ఇప్పుడు హిట్ బాగా అవసరం. అదే సమయంలో సినిమాపై ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ కు సర్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 15వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని అటు పూరి.. ఇటు రామ్ చూస్తున్నారు. ఇద్దరికీ ఇప్పుడు హిట్ బాగా అవసరం. అదే సమయంలో సినిమాపై ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.
అయితే డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. పూరి డైరెక్ట్ చేసిన లైగర్ టైమ్ లో జరిగిన విషయం బయటకొస్తుందోమోనని కొందరు అనుమానిస్తున్నారు. మరికొందరు మాత్రం పూరీ, ఛార్మి తగిన చర్యలు తీసుకుని డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ చేస్తున్నారని అంటున్నారు. కానీ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను పేరు వినిపిస్తోంది. లైగర్ థియేట్రికల్ హక్కులను కొని భారీగా నష్టపోయిన ఆయన పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది.
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని వరంగల్ శ్రీను.. నో రిటర్న్ అగ్రిమెంట్ ద్వారా లైగర్ డీల్ సెట్ చేసుకున్నారు. అయితే ఆ సినిమా ఎలాంటి ఫ్లాప్ అయిందో తెలిసిందే. దీంతో ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయారు. ఆ తర్వాత తమకు డబ్బులు ఇవ్వాలని మేకర్స్ ను అడిగారు. కానీ వరంగల్ శ్రీను తనకే ఇవ్వండని కోరారు. దీంతో మీరు మీరు తేల్చుకోండని ఊరుకున్నారు పూరి జగన్నాథ్. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
అయితే డబుల్ ఇస్మార్ట్ మూవీతో నైజాం థియేటర్ల యజమానులు తమ నష్టాలను పూడ్చుకునేందుకు చూస్తున్నారు. అందుకు గాను ఏం చేయాలనే విషయంపై చర్చించారు. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను కూడా లైగర్ ఎగ్జిబిటర్లను కలిశారు. అందరూ తనకు సపోర్ట్ చేస్తే తమ నష్టాలను కవర్ చేసుకునే ప్రయత్నం చేద్దామని వరంగల్ శ్రీను చెప్పినట్లు తెలుస్తోంది. అందుకు ఎగ్జిబిటర్లు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక లైగర్ రిలీజ్ సమయంలో నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ పద్ధతిలో సినిమా హక్కులను కొనుగోలు చేయడం లీగల్ గా కూడా క్లియర్ అవ్వలేదు. పూరి, ఛార్మి వరంగల్ శ్రీనుకు డబ్బులు ఇవ్వాలో? లేక ఎగ్జిబిటర్లకు ఇవ్వాలో తేల్చుకోలేక సైలెంట్ అయ్యారు. దీంతో ఎవరికీ చెల్లించలేదు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ టైమ్ లో అంతా ఒక్కటై పోరాడేందుకు డిసైడ్ అయినట్లు ఒక టాక్ అయితే వైరల్ అవుతోంది. మరి టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.