ట్రైలర్ టాక్: ప్రదీప్ రంగనాథన్.. ఈసారి బీటెక్ డ్రాగన్
ఒక్క ఫ్రైడేతో స్టార్ గా మారిపోయిన వారిలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘లవ్ టుడే’ 100 కోట్ల కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
ఒక్క ఫ్రైడేతో స్టార్ గా మారిపోయిన వారిలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘లవ్ టుడే’ 100 కోట్ల కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తెలుగులోనూ యువతలో తనకంటూ ఓ క్రేజ్‌ని సంపాదించుకున్న ఈ యువ హీరో, ఇప్పుడు మరొక వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బీటెక్ యూత్ ని బాగా కనెక్ట్ చేసే విధంగా కథలను ఎంచుకునే ప్రదీప్, ఈసారి బ్యాక్ డ్రాప్ లో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అంటూ ప్రేక్షకులకు మరోసారి మజా ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించగా, కథలో కాలేజ్ లైఫ్ కామెడీ, మధ్యతరగతి ఫ్యామిలీ లైఫ్ కు సంబంధించిన అంశాలను కలిపి చూపించనున్నట్లు అర్ధమవుతుంది. ఇందులో ప్రదీప్ సరసన అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. అశ్వత్ మారిముత్తు గతంలో ‘ఓ మై గాడ్’ వంటి మంచి లవ్ స్టోరీతో తమిళ్ తెలుగులో మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇప్పుడు మరింత ఎంటర్‌టైనింగ్ కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చాడు.
ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ చూస్తే, ప్రదీప్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో, మాస్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా, ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. కాలేజీ లైఫ్ నేపథ్యంగా ఉండే కథలో బిటెక్ లో భారీ బ్యాక్ లాగ్స్ తో అల్లరిగా తిరిగే కుర్రాడు ప్రేమలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాగే ఫ్యామిలీ కోసం అతను ఏం చేశాడు అనే పాయింట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
ప్రేమలో వచ్చే మార్పులు, హీరో జీవితం ఎలా మారిపోతుందనేదానిపై ప్రధానంగా ఫోకస్ చేశారు. ప్రదీప్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, యూత్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్, రొమాంటిక్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి ట్రైలర్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మరోసారి తన నటనతో ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఆమె లుక్స్, పాత్ర డిజైన్ ట్రైలర్‌లో మంచి హైలైట్ అయ్యాయి. అలాగే, మరో హీరోయిన్ కయాదు లోహర్ కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
దర్శకుడు అశ్వత్ స్క్రీన్‌ప్లే చాలా ఆసక్తికరంగా మలిచినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా కూడా ‘లవ్ టుడే’ లా భారీ విజయాన్ని సాధించగలదా అనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అప్డేట్స్, టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్నాయి. ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ కథలో ప్రదీప్ పాత్ర ఎలా ఉంటుందో, ఆయన పాత్ర వెనక ఉన్న డ్రామా ఏమిటో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 21న సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘లవ్ టుడే’ తర్వాత ప్రదీప్‌కు తెలుగులోనూ అభిమానులు పెరిగారు. మరి ఈసారి అతను ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.