'తండేల్' తర్వాత దుల్లగొట్టే హీరోలెంత మంది?
అదే సక్సస్ ని తర్వాత `తండేల్` కొనసాగిస్తుంది. ఈ విజయాల్ని మరిన్ని సినిమాలు కొనసాగించాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
`తండేల్` తో ఈ ఏడాది మరో సెంచరీ నమోదైంది. నాగచైతన్య నటించిన `తండేల్` భారీ విజయం దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఏడాది ఆరంభం `గేమ్ చేంజర్` నిరాశ పరిచినా తర్వాత రిలీజ్ అయిన `డాకు మహారాజు` మంచి ఫలితం అందుకోగా..రెండు రోజుల గ్యాప్ లో రిలీజ్ అయిన `సంక్రాంతి కి వస్తున్నాం` ఏకంగా300 కోట్ల క్లబ్ లో చేరడంతో రీజనల్ గా టాలీవుడ్ సత్తా ఏంటి? అన్నది మరోసారి ప్రూవ్ అయింది.
అదే సక్సస్ ని తర్వాత `తండేల్` కొనసాగిస్తుంది. ఈ విజయాల్ని మరిన్ని సినిమాలు కొనసాగించాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఈనేపథ్యంలో ఫిబ్రవరి ముగిసేలోపు మరిన్ని చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతు న్నాయి. `లవ్ టుడే` ఫేం ప్రదీప్ రంగనాధ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన `డ్రాగన్` తెలుగులో `రిటర్న్ ఆఫ్ డ్రాగన్` గా రిలీజ్ అవుతుంది. ఇది లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా అశ్వత్ మారిముత్తు తెరకెక్కించాడు.
ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఫిబ్రవరి 21న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయా దర్శకత్వంలో నిర్మించిన `జాబిలమ్మ నీకు అంత కోపమా` ఫిబ్రవరి 21 న తెలుగు, తమిళ్ లో రిలీజ్ అవుతుంది. భిన్నమైన రొమాంటిక్ కామెడీ చిత్రమిది. యువతరంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే విధంగా సినిమా ఉంటుందని యూనిట్ ప్రమోట చేస్తోంది. అలాగే `బాపు` ` ఏ ఫాదర్ సూసైడ్ స్టోరీ` కూడా ఇదే రోజు రిలీజ్ అవుతుంది.
బ్రహ్మాజీ, ఆమని, `బలగం` సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషించారు. పల్లెటూళ్లలో మానవ సంబంధాలు ఎలా ఉంటాయి? డబ్బు అవసరం వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారు? వంటి అంశాల్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. అలాగే ధనరాజ్ ప్రధాన పాత్ర పోషించిన `రామం రాఘవం` కూడా ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతుంది.
ఇందులో సముద్రఖని తండ్రి పాత్ర పోషిస్తున్నారు. ఇలా ఫిబ్రవరిలో కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. పోటీగా పెద్ద సినిమాలేవి కూడా లేవు కాబట్టి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద రాణించే అవకాశం ఉంది.