సినీ ప‌రిశ్ర‌మ‌లో వేధింపుల‌పై బ‌హిరంగ‌ నివేదిక‌

2017లో నటుడిపై లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో జస్టిస్ కె. హేమ నేతృత్వంలోని హేమ కమిటీ 2019 డిసెంబరు 31న ముఖ్యమంత్రికి నివేదికను సమర్పించింది.

Update: 2024-07-09 13:46 GMT

మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, లింగ అసమానత సమస్యలను పరిష్కరించేందుకు `హేమ కమిటీ` నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నాలుగేళ్ల తర్వాత.. రాష్ట్ర సమాచార కమిషన్ ఈ నివేదికను పబ్లిక్ డొమైన్‌లో విడుదల చేయాలని సాంస్కృతిక శాఖను ఆదేశించింది. ఇది ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర‌మైన మార్పుల‌కు స‌హ‌క‌రిస్తుంద‌ని భావిస్తున్నారు.

2017లో నటుడిపై లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో జస్టిస్ కె. హేమ నేతృత్వంలోని హేమ కమిటీ 2019 డిసెంబరు 31న ముఖ్యమంత్రికి నివేదికను సమర్పించింది. అనేక సంవత్సరాల తరబడి పలు పక్షాలు డిమాండ్ చేసినప్పటికీ విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) సహా నివేదికను రహస్యంగా ఉంచారు. అయితే ఇంత‌కాలానికి రాష్ట్ర స‌మాచార క‌మిష‌న్ ఆదేశం సంచ‌ల‌నంగా మారింది. డబ్ల్యుసిసి సభ్యురాలు, సినీ నిర్మాత అంజలి మీనన్ ఈ పరిణామాన్ని స్వాగతించారు. పరిష్కరించాల్సిన సమస్యలపై ఇది వెలుగునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

''ఈ ఆర్డర్ అన్ని పార్టీలను జవాబుదారీగా ఉంచే సానుకూల పరిణామం. మలయాళ చిత్ర పరిశ్రమలో పని ప్రదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రికి WCC చేసిన అభ్యర్థన ఆధారంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. పరిశ్రమకు చెందిన పలువురు మహిళలు తాము ఎదుర్కొన్న వివిధ స్థాయిల వివక్షల గురించి కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ప‌రిశోధ‌న‌లో కనుగొన్న విషయాలు అప్పుడు మార్పుకు దారితీస్తాయని ఆశిస్తున్నారు. దీని కోసం చాలా సమయం, ఎన‌ర్జీని ఖ‌ర్చు చేసారు. పన్ను చెల్లింపుదారుల డబ్బు ఖర్చు చేసారు. వాటన్నింటినీ సమర్థించడం ముఖ్యం. సమస్య పార‌ద‌ర్శ‌కంగా ఏమిటో నిర్వచించబడే వరకు పరిష్కారాల గురించి మాట్లాడాల్సిన పని లేదు'' అని అంజ‌లి మీన‌న్ అన్నారు.

సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజీ చెరియన్ మాట్లాడుతూ.. కమిషన్ ఆదేశాలను ప్రభుత్వం పాటిస్తుంది. ఎవరి గోప్యతకు భంగం కలిగించని భాగాలను విడుదల చేస్తుంది. రాష్ట్ర సమాచార కమిషనర్ ఎ. అబ్దుల్ హకీమ్ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం... సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద నిషేధిత‌మైనవి. సంబంధిత వ్యక్తుల గోప్యతను ప్రభావితం చేసేవి మినహా ఇతర సమాచారాన్ని నిలిపివేయకూడదు. అటువంటి సమాచారం నిలిపివేసిన వాస్తవం గురించి ద‌ర‌ఖాస్తుదారుల‌కు తెలియజేయాలి.

దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని సమాచార కమిషన్ ప్రశంసిస్తూనే, హేమ క‌మిటీ నివేదిక‌ నిలుపుదల కార‌ణ‌మైన శాఖ‌ల‌ను విమర్శించింది. పిటిషనర్ల ఉద్దేశాన్ని సరిగ్గా పరిశీలించకుండా ఒక నిర్దిష్ట సమాచారాన్ని నిలుపుదల చేయడంలో పక్షపాత వైఖ‌రిని అవ‌లంబించ‌ర‌ని .. డిపార్ట్‌మెంట్ అధికారులను విమ‌ర్శించారు. పరిశ్రమను పునరుజ్జీవింపజేయడానికి ఇక్క‌డ‌ పనిచేసే మహిళల భద్రతను నిర్ధారించడానికి ఏ విష‌య‌మూ ఎప్పటికీ దాచబడదు! అని ఒక నివేదికలోని వాస్తవాలు వెల్ల‌డిస్తున్నాయి. జూలై 25లోపు దరఖాస్తుదారులకు సమాచారాన్ని అందించాలని, లేని పక్షంలో రాష్ట్ర ప్రజా సమాచార అధికారి- అప్పీలేట్ అథారిటీ జూలై 27న తమ ముందు హాజరుకావాలని కమిషన్ శాఖను ఆదేశించింది.

పలువురు నటీనటులు పరిశ్రమలో పనిచేస్తున్న ఇతరులు కమిటీ ముందు లైంగిక వేధింపులు, అనధికారిక నిషేధాలు, వేతన చెల్లింపులు .. ఇతర వివాదాలకు సంబంధించిన సవివరమైన వాంగ్మూలాలను నమోదు చేశారు. నివేదికను రహస్యంగా ఉంచడంపై వివిధ వర్గాల నుండి వేడిని ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం 2022లో హేమా కమిటీ నివేదిక కోసం పరిశీలించి అమలు ప్రణాళికను రూపొందించడానికి ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ ఇప్పటి వరకు సమావేశమైనట్లు లేదా సిఫారసు చేసినట్లు బ‌హిరంగంగా ఎవ‌రికీ తెలియదు.

Tags:    

Similar News