ఒకరినొకరు ఏంటిలా.. స్టార్ కపుల్‌కి ఏమైంది?
కిషోర్ కుమార్ బాలీవుడ్ లెజెండరీ నటుడు. రణబీర్ తండ్రి రిషీ కపూర్ కంటే ముందు తరంలో ఏలిన మేటి నటుడు. అంత పెద్ద స్టార్ ఎవరో తనుకు తెలియదని అంటుందా?
అవును.. ఈ స్టార్ కపుల్ ఒకరికొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. పబ్లిక్ కి అనవసరంగా దొరికిపోతున్నారు. అనాలోచితంగా పబ్లిక్ వేదికలపై తమ భాగస్వామి గురించి ఏదో ఒకటి అనేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇంకా ఈ స్టార్ కపుల్ కి ఇంకా అర్థమైనట్టు లేదు! పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇఫీ-2024 ఉత్సవాల్లో పాల్గొన్న రణబీర్ కపూర్ తన భార్య ఆలియా భట్ గురించి మాట్లాడుతూ.. తనను మొదటిసారి కలిసినప్పుడు చాలా అమాయకంగా కిషోర్ కుమార్ ఎవరు? అని ఆలియా ప్రశ్నించిందని గుర్తు చేసుకున్నాడు. కిషోర్ కుమార్ బాలీవుడ్ లెజెండరీ నటుడు. రణబీర్ తండ్రి రిషీ కపూర్ కంటే ముందు తరంలో ఏలిన మేటి నటుడు. అంత పెద్ద స్టార్ ఎవరో తనుకు తెలియదని అంటుందా? అంటూ వేదిక వద్ద ప్రేక్షకుల్లో గుసగుస వినిపించింది.
గోవాలో జరుగుతున్న 55వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ వింత వ్యాఖ్యలు చేసాడు రణబీర్. ఓవైపు రిషీ కపూర్ శతజయంతి ఉత్సవాల గురించి ప్రస్థావిస్తూనే, తన భార్య గురించి ఇలాంటి వ్యాఖ్య చేయడం అభిమానులను షాక్ కి గురి చేసింది. ప్రేక్షకులలోంచి కొందరు షాక్ అయినట్టు తెలిపారు. ఆ తర్వాత దానిని కవర్ చేసేందుకు రణబీర్ చాలా తంటాటు పడ్డాడు. దీనిపై నెటిజనులు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ఒక ప్రతీకారం..! అంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. తన పెదవులపై లిప్‌స్టిక్ వేసుకోవడం రణబీర్‌కు ఇష్టం లేదని ఆలియా గతంలో వెల్లడించగా అతడిని తీవ్రంగా ట్రోల్ చేసారు. దానికి ఇప్పుడిలా ప్రతీకారం తీర్చుకున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. శతజయంతి ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 13 నుంచి 15 (రెండు రోజుల పాటు) వరకూ దేశమంతటా రాజ్ కపూర్ ఫిలింఫెస్టివల్ ని నిర్వహించనున్నారు. కపూర్ జీ నటించిన క్లాసిక్ సినిమాలను ప్రదర్శిస్తారు.