రామ్ చరణ్ ముఖ చిత్రం ఎప్పుడు ఇలా చూసి ఉండరు!
మరి `గేమ్ ఛేంజర్` విషయంలో పరిస్థితి ఏంటి అంటే? సినిమా మొత్తానికి భారీగానే ఖర్చు అయిందని నిర్మాత దిల్ రాజు మాటల్ని బట్టి అర్దమైంది.
ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ సినిమాల బడ్జెట్ ఎలా? ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. సెట్ కి వెళ్లక ముందు ఒకలా...వెళ్లిన తర్వాత మరోలా ఉంటుంది. అంతకంతకు బడ్జెట్ పెంచుకుంటూ పోతారు. డబ్బు మంచి నీళ్లలా ఖర్చు అవుతుంది. దీంతో సినిమా పూర్తయ్యేలోపు నిర్మాతకు తడిపి మోపుడవుతుంది. ఆ సినిమా హిట్ అయితే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు అలాగే ఉంటాయి. ప్లాప్ అయితే? నష్టాల భారం అంతకు మించి మోయాల్సి ఉంటుంది.
మరి `గేమ్ ఛేంజర్` విషయంలో పరిస్థితి ఏంటి అంటే? సినిమా మొత్తానికి భారీగానే ఖర్చు అయిందని నిర్మాత దిల్ రాజు మాటల్ని బట్టి అర్దమైంది. ఆయనతో సినిమా తీయడం అన్నది రాజుగారు ఎంతో కాలంగా డ్రీమ్ గా భావి స్తున్నారు. ఆ కల `గేమ్ ఛేంజర్` తో నెరవేరింది. ప్రస్తుతం పరీక్ష రాసిన విద్యార్ధిలా రాజుగారు ఫలితం ఎలా ఉంటుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఐదు పాటలకు రాజుగారు అక్షరాలా 75 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇంత వరకూ దిల్ రాజు కెరీర్ లో పాటల కోసం ఇంత మొత్తంలో పెట్టుబడి పెట్టలేదు. ఓ సినిమా మొత్తానికి పెట్టే డబ్బుంతా రాజుగారు పాటలకే పెట్టారంటే? ఆయన గట్స్ ని మెచ్చుకోవాలి. అయితే 75 కోట్లు ఖర్చు అయిందంటూ చెప్పిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అందులో రామ్ చరణ్ కూడా రాజుగారి పక్కనే ఉన్నారు.
75 కోట్లు ఖర్చు అయిందనగానే రామ్ చరణ్ షాక్ అయ్యాడు. ఆ షాక్ లో ఓ డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్ పేస్ లో చూపిం చాడు. కళ్లు పెద్దవి చేసి...గజం కిందకు లాగి మూతి బిగించారు. దీంతో రామ్ ఎంతగా ఖంగు తిన్నాడు? అన్నది అర్దమవుతుంది. శంకర్ సినిమాల్లో పాటలకు అత్యధికంగా ఖర్చు చేస్తారు. పాటల కోసమే కోట్ల రూపాయల సెట్లు నిర్మిస్తారు. ఆయన ప్రతీ సినిమాలో ఇది తప్పని ఖర్చు గానే నిర్మాతలు భావిస్తారు.