కింగ్ బర్త్ డేకి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించబోతున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది.
కింగ్ నాగార్జున అభిమానులకు మరో ట్రీట్ రెడీ చేస్తున్నారా? పుట్టిన రోజు సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించబోతున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. నాగార్జున కి సరైన కమర్శియల్ సక్సెస్ పడి చాలా కాలమవుతోంది. అందులోనూ `కింగ్` తరహాలో కామెడీ రోల్స్ చేసింది ఈ మధ్య కాలంలో లేదు. ట్రెండ్ ని ఫాలో అవుతూ కొత్త తరం కథలవైపు అడుగులు వేయడంతో వాటికి దూరమవ్వాల్సి వచ్చింది.
మధ్యలో `బంగార్రాజు` లాంటి సక్సెస్ వచ్చినా కింగ్ లా ట్రెండ్ సెట్ చేయలేకపోయింది. వైవిథ్యమైన ప్రయత్నాలు పేరు తెస్తున్నా! సాధారణ ప్రేక్షకులకు దూరమవుతున్నామా? అన్న ఆలోచన ఓవైపు ఉంది. ఈ నేపథ్యంలో కొత్త రచయితల్ని సైతం దర్శకులిగా పరిచయం చేసే బాధ్యతలు తీసుకున్నారు నాగ్. ప్రస్తుతం ప్రసన్న కుమార్ బెజవాడతో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పక్కా కమర్శియల్ చిత్రం. ప్రసన్న కుమార్ గతంలో పనిచేసిన హిట్ సినిమాలు చూసి ఈ అవకాశం కల్పించారు.
ఈ నేపథ్యంలో తాజాగా సిల్వర్ స్క్రీన్ పతాకంపై నాగ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. ఆ ప్రాజెక్ట్ వివరాలు పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే దర్శకుడు ఎవరు? అన్నది క్లారిటీ లేదు. ఆ వివరాలు కూడా ఆ రోజు రివీల్ చేసే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దర్శకుడు ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నాగ్ తో అనీల్ రావిపూడి చర్చలు జరిపినట్లు ప్రచారం సాగింది. ఆయనతో పాటు కొంత మంది కొత్త మేకర్స్ రేసులో కి వచ్చారు.
తాజా అప్ డేట్ నేపథ్యంలో బర్త్ డేకి ప్రాజెక్ట్ సహా దర్శకుడు ఎవరు? అన్నది క్లారిటీ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. రీ-రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఇదే బర్త్ డేకి మన్మధుడు చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ప్రసన్న కుమార్ ప్రాజెక్ట్ అప్ డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.