'అఖండ 2' ఏమాత్రం ఆలస్యం లేదు..!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 'డాకు మహారాజ్' సినిమాతో బిజీగా ఉన్నాడు.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 'డాకు మహారాజ్' సినిమాతో బిజీగా ఉన్నాడు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఈనెల చివరి వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. 2025 జనవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ చేస్తున్నారు. సంక్రాంతికి సినిమా వస్తే కచ్చితంగా మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి. తాజాగా టైటిల్‌తో పాటు టీజర్‌ను రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో టైటిల్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
డాకు మహారాజ్ తర్వాత బాలకృష్ణ చేయబోతున్న సినిమా అఖండ 2 అనే విషయం తెల్సిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే తమన్ తన వాయింపు మొదలు పెట్టారట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ అఖండ 2 కోసం వర్క్ ప్రారంభం అయిందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఒక సాంగ్‌ను సైతం రికార్డ్ చేసినట్లుగా తమన్ ప్రకటించాడు.
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన సినిమాలు అన్నీ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా అఖండ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అఖండ 2 సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉందని, 2025లో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి మెల్లగా పూర్తి చేసి 2026 కి విడుదల చేసే విధంగా దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ఈ ఏడాదిలోనే ప్రారంభం కాబోతుంది. విడుదలకు ఎక్కువ సమయం తీసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు.
2025 దసరా వరకు బోయపాటి శ్రీను అఖండ 2 సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కారణంగా సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించలేక పోయారు. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాలేదు. ఈ ఏడాది ఆయన నుంచి రెండు సినిమాలు ఆశించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. అందుకే వచ్చే ఏడాదిలో అయినా రెండు సినిమాలు ఇవ్వాలని బాలయ్య భావిస్తున్నాడట. అందుకే అఖండ 2 సినిమాను 2025లోనే విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం అన్‌స్టాపబుల్ షో తో బిజీగా ఉన్న సినిమా షూటింగ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయట.