హద్దులు చెరిపేయాలి... పుష్ప 2 కోసమేనా?
తెలుగు ప్రేక్షకులకు 'పెళ్లి సందడి' సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల.
తెలుగు ప్రేక్షకులకు 'పెళ్లి సందడి' సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. మొదటి సినిమా కమర్షియల్‌గా డిజాస్టర్‌గా నిలిచినా ఆ తర్వాత మంచి ఆఫర్లు వచ్చాయి. ధమాకా సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్లో ఒక్కసారిగా టాప్ స్టార్ హీరోయిన్గా మారి పోయింది. ఏక కాలంలో నాలుగు అయిదు సినిమాలు చేసే స్థాయికి చేరింది. ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకున్న శ్రీలీల పుష్ప 2 లో ఐటెం సాంగ్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. ఆ ఐటెం సాంగ్ ఎప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్స్‌తో దర్శకుడు సుకుమార్ చర్చలు జరిపారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ మధ్య ఒక బాలీవుడ్ హీరోయిన్ కమిట్ అయిందని కూడా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఐటెం సాంగ్ లో శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. కిస్సిక్ అంటూ సాగే ఐటెం సాంగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి డాన్స్ చేసింది. ఇద్దరు పోటీ పడి డాన్స్ చేసినట్లుగా యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. కిస్సిక్ పాట పుష్ప 2 సినిమా స్థాయిని అమాంతం పెంచడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ పాట చేసిన తర్వాత అల్లు అర్జున్ పై శ్రీలీల ప్రశంసల వర్షం కురిపించింది.
అల్లు అర్జున్‌తో పాట చేస్తూ చాలా నేర్చుకున్నాను అంది. అంతే కాకుండా ఆయనతో వర్క్ ఎప్పటికీ సంతోషాన్ని ఇస్తుందని, ముందు ముందు కూడా ఆయనతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా షేర్ చేసింది. అల్లు అర్జున్‌కి ప్రత్యేక బహుమానం అందించిన శ్రీలీల తన ఆనందాన్ని షేర్ చేసుకుంటూ ఒక నోట్ ను పంపించింది. ఆ విషయం గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర లైన్స్‌ను షేర్ చేయడం ద్వారా అసలేం జరుగుతుంది అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో శ్రీలీల ది వైల్డ్ చైల్డ్ పేరుతో ఈ పోస్ట్ చేసింది. అందులో అందంగా నవ్వాలి, హద్దులు చెరిపేయాలి, వాలుగా చూడాలి, కవ్వింతగా కనుసైగ చేయాలి అంటూ ఉన్న ఒక పోస్ట్‌ను షేర్ చేయడం జరిగింది. ఆ లైన్స్ దేనికి సంబంధించింది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాంతో చాలా మంది ఆ లైన్స్ పుష్ప 2 లో ఆమె చేసిన ఐటెం సాంగ్ కిస్సిక్ లోని లైన్స్ అయ్యి ఉంటాయి అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆమె నోటి నుంచి ఏదో ఒక సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.