బిగ్ బాస్ 8 : ఆ ఇద్దరిలో ఒకరు హౌస్ కి బై బై..!

ఓజీ క్లాన్ సభ్యుల్లో ఒకరు రాయల్ క్లాన్ సభ్యుల నుంచి ఒకరు ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

Update: 2024-10-19 09:31 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం నామినేషన్స్ లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. రాయల్ క్లాన్ నుంచి ముగ్గురు ఓజీ క్లాన్ నుంచి ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఐతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో గౌతం, టేస్టీ తేజ, హరితేజ నామినేషన్స్ లో ఉండగా పృధ్వి, ప్రేరణ, యష్మి, నిఖిల్, మణికంఠ, నబీల్ నామినేషన్స్ లో ఉన్నారు. ఓజీ క్లాన్ సభ్యుల్లో ఒకరు రాయల్ క్లాన్ సభ్యుల నుంచి ఒకరు ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

రాయల్ క్లాన్ నుంచి లీస్ట్ ఓటింగ్ లో హరితేజ ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన హరితేజ సీజన్ 1 కంటెస్టెంట్ అని తెలిసిందే. అయితే ఆ సీజన్ లో ఆమె హరికథ చెప్పి ఆడియన్స్ ను అలరించింది. సీజన్ 1 లో ఆమె ఎంతో చలాకీగా కనిపించింది. సీజన్ 8 లో హరితేజ అనుకున్నంత రేంజ్ లో పర్ఫార్మ్ చేయలేకపోతుంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో లీస్ట్ 1, 2 పొజిషన్ లో ఉంది హరితేజ.

ఇక ఓజీ క్లాన్ నుంచి పృధ్వి లీస్ట్ ఓటింగ్ లో కొనసాగుతున్నాడు. టాస్కుల్లో మంచి ఫైట్ ఇస్తున్న పృధ్వి మిగతా విషయాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించట్లేదు. ఇదే విషయాన్ని కొందరు కంటెస్టెంట్స్ పృధ్వికి చెప్పారు. మరోపక్క బిగ్ బాస్ ఈమధ్య ఇచ్చిన హెయిర్ కట్ ఛాలెంజ్ లో కూడా పాల్గొనేందుకు నిరాకరించాడు పృధ్వి. కేవలం ఫిజికల్ టాస్క్ లు మాత్రమే కాదు ఆటని ముందుకు సాగించే ఏ టాస్క్ అయినా ఆడాల్సి ఉంటుంది. అలా కాకుండా తనకు నచ్చిన టాస్క్ మాత్రమే ఆడతా అంటే బయట ఆడియన్స్ కూడా అలాంటి ఫలితాన్నే ఇస్తారు.

ప్రస్తుతం సీజన్ 8 లో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారందరిలో పృధ్వి, హరితేజ మాత్రమే లీస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆదివారం తెలుస్తుంది. ఐతే లీక్స్ ప్రకారం పృధ్వి ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తున్నా అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 8 లో అటు పృధ్వి ఇటు హరితేజ ఎవరు వెళ్లినా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్లినట్టే అని చెప్పొచ్చు.

Tags:    

Similar News