హర్షసాయి కేసులో సీసీటీవీ ఆధారాలు: వీడియోలో ఏం జరిగింది?

యూట్యూబర్ హర్షసాయి పై నమోదైన అత్యాచార కేసు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది.

Update: 2024-09-25 10:30 GMT

యూట్యూబర్ హర్షసాయి పై నమోదైన అత్యాచార కేసు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ కేసు నేపధ్యంలో కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. తాజాగా, హర్షసాయి మరియు బాధితురాలికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వీరిద్దరూ ఒక హోటల్ వరండాలో గొడవ పడుతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.

వీడియోలో బాధితురాలు కోపంతో హోటల్ నుండి బయటకు వెళ్లిపోతున్నప్పుడు, హర్షసాయి తన మొబైల్ ఫోన్ లో ఏదో చూపిస్తూ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ వాదన ఏ విషయంపై అనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

బాధితురాలు హర్షసాయి పై చేసిన ఆరోపణలలో ఈ సంఘటనకు ఏదైనా సంబంధం ఉందా అనే ప్రశ్నలు అభిమానుల్లో మరియు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు హర్షసాయి తనపై వచ్చిన ఆరోపణలపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ, ఈ కేసు డబ్బుల కోసమే పెట్టినట్లు ఆరోపణలు చేస్తున్నాడు. "అన్ని నిజాలు త్వరలో బయటకు వస్తాయి. నా అడ్వొకేట్ అన్ని విషయాలను బయట పెడతారు" అని హర్షసాయి తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

కానీ ప్రస్తుతం హర్షసాయి ఎక్కడ ఉన్నాడు అనే విషయంపై మాత్రం పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. హర్షసాయి మరియు బాధితురాలు మధ్య ఉన్న ఈ గొడవ వీడియోపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఈ కేసు నేరుగా న్యాయ విచారణకు దారితీస్తే, ఈ వీడియో కూడా కేసులో కీలక ఆధారంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి.

నార్సింగి పోలీసులు హర్షసాయి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా, ఈ వీడియో కేసు విచారణలో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. హర్షసాయి ప్రస్తుతం తనపై వచ్చిన ఆరోపణలు తప్పు అని చెబుతున్నా, ఈ వీడియోలోని వివరాలు విచారణను మరో మలుపు తిప్పవచ్చని అర్ధమవుతుంది. దాదాపు బాధిత మహిళ నుంచి హర్షసాయి దాదాపు 2 కోట్ల వరకు డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఆ విషయంలో కూడా నిజాలు తెలియాల్సి ఉంది. హర్షసాయి ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఆ సినిమాకు కూడా బాధిత మహిళ ఒక నిర్మాతగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News