VDకి అమ్మ-నాయనలు పెట్టిన పేరు చాలుట!
సక్సెస్ అయిన తర్వాత స్టార్ స్టేటస్ ని బట్టి ఇండస్ట్రీ ఓ ట్యాగ్ అనేది క్రియేట్ చేస్తుంది
సక్సెస్ అయిన తర్వాత స్టార్ స్టేటస్ ని బట్టి ఇండస్ట్రీ ఓ ట్యాగ్ అనేది క్రియేట్ చేస్తుంది. పరిశ్రమ కష్టాన్ని గుర్తించి గౌరవంగా ఆపాదించే ట్యాగ్ అది. చిరంజీవికి మెగాస్టార్..బాలయ్యకి నటసింహ...వెంకటేష్ కి విక్టరీ...,నాగార్జునకి కింగ్..మహేష్ కి సూపర్ స్టార్.. తారక్ కి యంగ్ టైగర్...బన్నీ కి స్టైలిష్ స్టార్ ఇలా ఈ బిరుదులన్ని పరిశ్రమ వాళ్ల పనితనాన్ని గుర్తించి ఇచ్చిన ట్యాగ్స్. వాటి స్థాయిని అంతకంతకు పెంచుకుం టూ వెళ్లడం అన్నది ఆయా హీరోలపై ఉన్న బాధ్యత.
ఈ నేపథ్యంలో విజయ్ దేరకొండకి కూడా కొన్ని ట్యాగ్ లు యాడ్ అయిన సంగతి తెలిసిందే. రౌడీ స్టార్ అని...రౌడీ బోయ్ అని..సెన్షేషనల్ స్టార్ అని కొంత మంది అభిమానులు పిలుచుకుంటారు. అయితే ఇలాంటి ట్యాగ్ లు నా కొద్దు అంటున్నాడు విజయ్. 'ఖుషీ' ఈవెంట్ లో భాగంగా వీటి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ' నాకు మా అమ్మ-నాయనలు పెట్టిన పేరు ఉంది. ఆ పేరుకి ముందు-వెనుక ఇంకేమి అవసరం లేదు.
ఆ స్టార్ ..ఈస్టార్ అంటున్నారు. ఖండిచకపోతే ఇంకే స్టార్ అయినా అయిపోతాం. ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు. అమ్మ-నాన్న ఇష్టపడి పెట్టిన విజయ్ దేవరకొండ అనే పేరు చాలు. పూరి లైగర్ సమయంలో ఇలాంటి టైటిల్స్ కొన్ని పరిశీలించారు. అప్పటి నుంచి బయట ఇలా ఆడేసుకుంటున్నారు. నాకెలాంటి బిరుదులు వద్దు. నన్ను నాలాగే పిలవండి ప్లీజ్' అంటున్నాడు.
అలాగే వివాదాలు..విమర్శలకు తానెప్పుడు దూరంగానే ఉంటానన్నాడు. ఎవరూ కాంట్రవర్శీ కోరుకోరు అని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు బధులిచ్చాడు. ప్రస్తుతం ఖుషీ రిలీజ్ కోసం ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఆడియో పెద్ద హిట్ అయింది. శివ మార్క్ లవ్ బుల్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.