ప్రభాస్.. ఆ సినిమా బడ్జెట్ ఎంతంటే..

టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Update: 2024-06-12 04:52 GMT

యానిమల్ మూవీతో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డార్లింగ్ ప్రభాస్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. స్పిరిట్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనున్న విషయాన్ని ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా స్పష్టం చేశాడు. స్క్రిప్ట్ ప్రస్తుతం రెడీ అవుతోంది. ఈ ఏడాది ఆఖరులో మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టర్ ఎంత వైల్డ్ గా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడంట. ప్రభాస్ కెరియర్ లోనే ఫస్ట్ టైం పోలీస్ రోల్ స్పిరిట్ మూవీలో చేస్తున్నాడు.

అర్జున్ రెడ్డి, యానిమల్ తరహాలోనే స్పిరిట్ మూవీలో కూడా ప్రభాస్ క్యారెక్టర్ ని వైల్డ్ గానే డిజైన్ చేశారంట. ఈ సినిమాకి ఏకంగా 300 కోట్ల వరకు బడ్జెట్ అవ్వనుందని తెలుస్తోంది. అంటే సందీప్ రెడ్డి ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాల కంటే స్పిరిట్ మూవీ ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికని మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది.

ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీని తర్వాత లైన్ అప్ లో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాజాసాబ్ ఉంది. అలాగే సలార్ 2 కూడా పూర్తి చేయాల్సి ఉంది. వీటితో పాటు స్పిరిట్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది.

కల్కి 2898 మూవీని హాలీవుడ్ రేంజ్ లో పాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే విదేశాల్లో కూడా ప్రభాస్ కి మార్కెట్ పెరుగుతుంది. నెక్స్ట్ రాబోయే నాలుగు సినిమాలకి కల్కి మూవీ క్రియేట్ చేసే మార్కెట్ స్కోప్ ప్లస్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News