‘హిసాబ్ బరాబర్’ ట్రైలర్: మరో స్కామ్ గుట్టు విప్పుతున్న మాధవన్

హిసాబ్ బరాబర్ ట్రైలర్ కథాంశాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. రాధే మోహన్ శర్మ అనే రైల్వే ఉద్యోగి పాత్రలో మాధవన్ నటన మెప్పించనుంది.

Update: 2025-01-12 06:19 GMT

జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో జనవరి 24న విడుదలకు సిద్ధమవుతున్న సినిమా హిసాబ్ బరాబర్. ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ట్రైలర్ రీసెంట్ గా విడుదలై ఆసక్తి రేకెత్తించింది. ట్రైలర్‌లో కనిపించిన కథ, పాత్రలు, అభినయాలతో సినిమా సరికొత్త అనుభూతిని అందించబోతోందని స్పష్టమైంది. మాధవన్ పోషించిన సామాన్యుడి పాత్ర, ఆర్థిక మోసాల నేపథ్యంతో రూపొందిన కథ, ప్రేక్షకులను ఆశ్చర్యపరచడమే కాకుండా ఆలోచింపజేస్తుంది.

హిసాబ్ బరాబర్ ట్రైలర్ కథాంశాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. రాధే మోహన్ శర్మ అనే రైల్వే ఉద్యోగి పాత్రలో మాధవన్ నటన మెప్పించనుంది. బ్యాంకు ఖాతాలో కనిపించిన చిన్న పొరపాటునే జీవితాంతం సమస్యగా మార్చే పరిస్థితులను ట్రైలర్ స్పష్టంగా చూపించింది. ఆర్థిక మోసాలు, అవినీతి, న్యాయం కోసం సామాన్యుడి పోరాటం సినిమా ప్రధాన థీమ్‌గా నిలిచింది.

ఈ సినిమాలో నీల్ నితిన్, కీర్తి కుల్హారి వంటి నటి నటుల కీలక పాత్రలు మరింత బలాన్నిస్తాయి. ముఖ్యంగా, మాధవన్ - నీల్ నితిన్ మధ్య సాగే ఆసక్తికరమైన పతాక సన్నివేశాలు ట్రైలర్‌లో హైలైట్ అయ్యాయి. మాధవన్ పాత్రలోని నిబద్ధత, చట్టపరమైన పోరాటానికి సిద్దపడే సామాన్యుడి ధైర్యం కథకు కీలక బలం. అశ్విన్ ధీర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సమాజంలోని ఆర్థిక వ్యవస్థలోని లోపాలను కళ్ళముందు తీసుకువస్తుంది.

జియో స్టూడియోస్, ఎస్‌పి సినీకార్ప్ నిర్మించిన ఈ సినిమా టెక్నికల్‌గా కూడా ఉన్నతంగా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్‌లో సీరియస్ డ్రామా, సస్పెన్స్, కామెడీ అన్నీ సమపాళ్ళలో మేళవించబడ్డాయి. మొత్తం సినిమా న్యాయవ్యవస్థ, అవినీతిపై సామాన్యుడి పోరాటాన్ని ఆసక్తికరంగా చూపించనుందని ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. మాధవన్ నటన, కీర్తి కుల్హారి పాత్రలు సినిమాపై మరింత అంచనాలు పెంచుతున్నాయి.

సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ ఊహించని మలుపులతో ప్రేక్షకులను కట్టిపడేయనుందని అర్ధమవుతుంది. ఈ చిత్రం హిసాబ్ బరాబర్ సమాజంలో జరిగిన ఆర్థిక మోసాలు, అవినీతిపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి అనువైన సందేశాన్ని అందించనుంది. సామాన్యుడి కథ, అతని ధైర్యం, న్యాయం కోసం సాగే ప్రయాణం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.

Full View
Tags:    

Similar News