ప్రభాస్.. ఒక్క నిర్మాత నుంచే 600 కోట్లు

వీటిలో రెండు సీక్వెల్స్ కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.

Update: 2024-11-09 04:46 GMT
ప్రభాస్.. ఒక్క నిర్మాత నుంచే 600 కోట్లు
  • whatsapp icon

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక మార్కెట్ ఉన్న స్టార్ గా ఉన్నాడు. అతని సినిమాలు 300 నుంచి 600 కోట్ల వరకు బడ్జెట్ లో తెరకెక్కుతున్నాయి. సినిమా సినిమాకి ప్రభాస్ రేంజ్ పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అఫీషియల్ గా అయితే 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో రెండు సీక్వెల్స్ కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.

అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ షూటింగ్ జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. అలాగే ‘సలార్ 2’, ‘కల్కి 2898ఏడీ’ సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి. వీటిని పూర్తి చేసేసరికి కనీసం 3 ఏళ్ళు పట్టొచ్చని అనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో ఉన్న 5 సినిమాలలో కనీసం మూడు చిత్రాలు 1000 కోట్ల క్లబ్ లో చేరుతాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ‘కేజీఎఫ్’ సిరీస్ తో పాన్ ఇండియా నిర్మాతగా మారిన విజయ్ కిరంగదూర్ తన హోంబలే ఫిలిమ్స్ లో ప్రభాస్ తో ‘సలార్’ చేశారు. ఇది కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ‘సలార్ పార్ట్ 2’ లైన్ లో ఉంది. ఇది కాకుండా ప్రభాస్ తో హోంబలే ఫిలిమ్స్ మరో రెండు సినిమాలు నిర్మించడానికి అగ్రిమెంట్ చేసుకుందని నిర్మాత విజయ్ కిరంగదూర్ అధికారికంగా ప్రకటించారు. ‘సలార్ 2’ తర్వాత ప్రభాస్ తో హోంబలే ఫిలిమ్స్ చేయబోయే సినిమాలు ఏ దర్శకులతో ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరో వైపు ఈ నెక్స్ట్ మూడు సినిమాల కోసం హోంబలే ఫిలిమ్స్ ప్రభాస్ కి ఏకంగా 600 కోట్లు రెమ్యునరేషన్ గా చెల్లిస్తున్నారంట. అంటే ఒక్కో సినిమాకి 200 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్ లలో ఒకడిగా ప్రభాస్ నిలిచాడు. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకి 150 నుంచి 200 కోట్ల మధ్యలోనే ఛార్జ్ చేస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ ప్రభాస్ తో చేయబోయే మూడు సినిమాలు 2026, 2027, 2028 లో వస్తాయని కూడా కన్ఫర్మ్ చేశారు.

అంటే ప్రభాస్ ప్రస్తుతం చేస్తోన్న ఐదు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు కూడా 4 ఏళ్ళల్లోనే ఫినిష్ అవుతాయని తెలుస్తోంది. ఇలా ఫినిష్ చేయాలంటే గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ ని ప్రభాస్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే ఫినిష్ చేసేలానే కనిపిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయ్యేసరికి అతని మార్కెట్ వేల్యూ 1000 కోట్లు దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. అలాగే రెమ్యునరేషన్ కూడా 300 కోట్లు దాటిపోతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News