కాకి (Vs) డేగ: దళపతి విజయ్‌ని రజనీ కాకితో పోల్చారా?
జైలర్` ఆడియో ఆవిష్కరణ వేడుకలో `హుకుం` పాట పేరుతో రజనీ ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారో.. అంటూ ఇప్పుడు నెటిజనుల్లో ఒక సెక్షన్ విస్త్రతంగా చర్చకు తెర లేపింది.;
``పక్షులలో కాకి ప్రతి ఒక్కరినీ డిస్టర్బ్ చేస్తుంది. డేగ ఎప్పుడూ అందరినీ డిస్టర్బ్ చేయదు. ఎప్పుడైతే కాకి డేగకు భంగం కలిగిస్తుందో డేగ అప్పుడు ఏమీ చేయదు.. అది నెక్ట్స్ లెవల్ కు ఎగురుతుంది..!`` `జైలర్` ఆడియో ఆవిష్కరణ వేడుకలో `హుకుం` పాట పేరుతో రజనీ ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారో.. అంటూ ఇప్పుడు నెటిజనుల్లో ఒక సెక్షన్ విస్త్రతంగా చర్చకు తెర లేపింది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈవెంట్లో రజనీ స్పీచ్ ఆద్యంతం రక్తి కట్టించింది. జైలర్ పాటలకు చక్కని స్పందన వస్తోంది.
అయితే రజనీకాంత్ `హుకుమ్` పాట వివాదాస్పద సాహిత్యాన్ని ప్రస్తావించడంతో అసలు చర్చ మొదలైంది. త్వరలో రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్న దళపతి విజయ్‌ను రజనీ లక్ష్యంగా చేసుకున్నారని పలువురు భావిస్తున్నారు. తనదైన అసమానమైన శైలిలో రజనీకాంత్ తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఒక రూపకాన్ని ఉపయోగించారని కూడా విశ్లేషిస్తున్నారు. డేగ వంటి ఉన్నతమైన సంస్థ.. కాకి వంటి తక్కువ వ్యక్తి చర్యలకు కలవరపడదు అంటూ విజయ్‌ని `కాకి`తో పోలిక పెట్టడం చర్చనీయాంశమైంది.
అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా దీనిపై ఒక స్పష్ఠమైన వివరణ ఇచ్చి గాసిప్పులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. కవులు తమ పద్యాలలో కాకులు-గ్రద్దలు అనే పదాలను ఉపయోగించినప్పుడు అవి ఎవరినో ఉద్ధేశించినవని అనుకోనవసరం లేదని రజనీకాంత్ నొక్కి చెప్పారు. సోషల్ మీడియాలోని వ్యక్తులు ఇలాంటివి ఊహించుకోవచ్చని అయితే కవుల పదాల అల్లిక తాలూకా సాధారణ అర్థాన్ని తెలుసుకోవడం చాలా కీలకమని ఆయన హెచ్చరించారు. కుక్కలు సహజంగా మొరిగినట్లే, విమర్శించే నోరు ఎప్పుడూ ఉంటుంది. కానీ అలాంటి చప్పుళ్లకు పరధ్యానంలో పడకుండాఎవరి పనిపై వారు దృష్టి పెట్టి ముందుకు సాగడం చాలా అవసరమని సూచించారు. రజనీకాంత్ తనకు దళపతి విజయ్‌పై ఎలాంటి ద్వేషం లేదని చాలా స్పష్ఠంగా చెప్పడం విశేషం. కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టి తనదైన భావజాలంతో ముందుకు సాగుతున్నారు. అయినా రాజకీయాల్లో ఉన్న రజనీకాంత్ తన స్నేహితుడితో ఎప్పటిలానే ఉన్నారు. ఇక యువ అగ్ర హీరో దళపతి విజయ్ విషయంలోను రజనీ అనవసర భేషజాలకు పోవడం లేదని ఆయన స్పీచ్ వెల్లడించింది.