పూరి, ఛార్మి సేఫ్.. అతనికి మాత్రం డబుల్ దెబ్బ!
సరైన కథ, కథనం లేకపోవడం వలనే డబుల్ ఇస్మార్ట్ మూవీ డిజాస్టర్ అయ్యిందనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.
రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అయ్యి వారం రోజులు కాకుండానే కంప్లీట్ గా వాష్ అవుట్ అయ్యిందనే మాట వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్యలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో ఆడియన్స్ ని అస్సలు మెప్పించలేకపోయింది. పూరి జగన్నాథ్ విజన్, రామ్ పోతినేని ఎనర్జీ డబుల్ ఇస్మార్ట్ సినిమాని సక్సెస్ గా నిలబెట్టలేకపోయాయి. సరైన కథ, కథనం లేకపోవడం వలనే డబుల్ ఇస్మార్ట్ మూవీ డిజాస్టర్ అయ్యిందనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.
రామ్ పోతినేని నుంచి ఇంతకుముందు వచ్చిన ది వారియర్, స్కంద సినిమాలు డిజాస్టర్ అయిన కూడా కనీసం 30 శాతం థీయాట్రికల్ కలెక్షన్స్ ని రికవరీ చేసింది. అయితే డబుల్ ఇస్మార్ట్ మూవీ పైన జరిగిన థీయాట్రికల్ బిజినెస్ లో కనీసం 25 శాతం కూడా రికవరీ కాలేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రం అన్ని భాషలకి సంబందించిన రైట్స్ ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డికి ముందుగానే భారీ మొత్తానికి అమ్మేశారు.
ఈ విధంగా డబుల్ ఇస్మార్ట్ నష్టాల నుంచి వారు ముందుగానే సేఫ్ అయ్యారు. నిర్మాతగా హనుమాన్ సినిమాతో నిరంజన్ రెడ్డి భారీ లాభాలు సొంతం చేసుకున్నారు. హనుమాన్ తో వచ్చిన ప్రాఫిట్ ని డబుల్ ఇస్మార్ట్ మీద పెట్టుబడిగా పెట్టారంట. అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మూవీ వాష్ అవుట్ అవ్వడంతో నిరంజన్ రెడ్డి భారీగా నష్టపోయారనే ప్రచారం నడుస్తోంది.
హనుమాన్ తర్వాత ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నుంచి ప్రియదర్శి హీరోగా డార్లింగ్ మూవీ వచ్చింది. ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో కంప్లీట్ చేశారు. థీయాట్రికల్ గా ఈ సినిమా నష్టం వచ్చిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి రికవరీ అయిపొయింది. అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమా రైట్స్ ని కొనుగోలు చేస్తున్నప్పుడే నిరంజన్ రెడ్డి పెద్ద రిస్క్ చేస్తున్నాడనే మాట వినిపించింది.
దానికి తగ్గట్లుగానే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మూవీ నిర్మాత నిరంజన్ రెడ్డిని డిస్టిబ్యూటర్ గా నిండా ముంచిందనే టాక్ వినిపిస్తోంది. నెక్స్ట్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా భారీ బడ్జెట్ తో ఓక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లోనే నిర్మిస్తున్నారు. ఈ సినిమా డబుల్ ఇస్మార్ట్ తో వచ్చిన నష్టాలని తిరిగి రికవరీ చేస్తుందనే నమ్మకంతో నిర్మాత ఉన్నారు. డబుల్ ఇస్మార్ట్ ఇచ్చిన షాక్ ద్వారానైనా ఇకపై డిస్టిబ్యూటర్స్ కాస్త జాగ్రత్త పడతారని ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు.