టైగర్ నాగేశ్వరరావు : అప్పుడు బయోపిక్ అన్నారు, ఇప్పుడేమో..!
రవితేజ తో దర్శకుడు వంశీ టైగర్ నాగేశ్వరరావు సినిమా ను రూపొందిస్తున్నట్లుగా ప్రకటించిన సమయంలో బయోపిక్ అన్నట్లుగా యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలకు సిద్ధం అయింది. కెరీర్ ఖతం అయ్యిందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా పుంజుకున్న రవితేజ ఫుల్ జోష్ తో చేసిన మూవీగా టైగర్ నాగేశ్వరరావు సినిమా గురించి మీడియా వర్గాల వారు మరియు రవితేజ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. టైగర్ నాగేశ్వరరావు కొందరు తెలుగు వారికి తెలిసిన గజ దొంగ.
స్టూవర్టుపురం పరిసర ప్రాంతాలకు చెందిన వారు టైగర్ నాగేశ్వరరావు గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. గజ దొంగ అయిన నాగేశ్వరరావు ఎంతో మంది పోలీసులకు చుక్కలు చూపించాడు. అంతే కాకుండా తాను దోచుకున్న డబ్బులో చాలా వరకు పేదలకు పంచే వాడు అని కూడా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. పోలీసులు మాత్రం నాగేశ్వరరావు ను ఒక దొంగ గానే చూసేవారట.
రవితేజ తో దర్శకుడు వంశీ టైగర్ నాగేశ్వరరావు సినిమా ను రూపొందిస్తున్నట్లుగా ప్రకటించిన సమయంలో బయోపిక్ అన్నట్లుగా యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్రను వెండి తెరపై ఆవిష్కరించబోతున్నట్లుగా చెప్పిన యూనిట్ సభ్యులు ఇప్పుడు మాట మార్చారు. టైగర్ నాగేశ్వరరావు గురించి ఎలాంటి నిజమైన ఆధారాలు, కథలు లభించలేదు అని దర్శకుడు వంశీ పేర్కొన్నాడు. యదార్థ ఊహాగాణాలతో సినిమాను రూపొందించినట్లు తెలియజేశాడు.
ఆయన గురించి జరుగుతున్న ప్రచారాలు, మరియు కల్పిత కథలను తీసుకుని ఈ సినిమాని రూపొందించినట్లు చెప్పుకొచ్చాడు. టైగర్ నాగేశ్వరరావును పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి చంపినట్లుగా రికార్డుల్లో ఉంది. కానీ దర్శకుడు వంశీ మాత్రం క్లైమాక్స్ ని అలా కాకుండా మరో రకంగా చూపించినట్లుగా సమాచారం అందుతోంది.
తెలుగు కమర్షియల్ సినిమాల్లో హీరో చనిపోతే ప్రేక్షకులు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కనుక రవితేజ ను ఈ సినిమాలో చంపేసి ఉండక పోవచ్చు అంటున్నారు. ఒకవేళ టైగర్ నాగేశ్వరరావు చనిపోయినట్లుగా చూపించినా కూడా ఆ తర్వాత మళ్లీ రవితేజ బతికి రావడమో లేదంటే ఇంకో రవితేజ ను చూపించడం వంటివి ఏమైనా దర్శకుడు చేస్తాడేమో చూడాలి. మొత్తానికి అయితే ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా మాదిరిగానే తీసినట్లుగా దర్శకుడు పేర్కొన్నాడు.