ఫోటో స్టోరి: వ్వాటే ఇస్ట‌యిల్ జ‌గ్గూభాయ్

తాజాగా అత‌డు షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. జ‌గ్గూభాయ్ స్టైలిష్ ఫ్యాంట్ ధ‌రించి, బ్లాక్ టీష‌ర్ట్ పై లాంగ్ కోట్ తో ఎంతో స్టైలిష్ గా క‌నిపించాడు.

Update: 2025-01-30 04:11 GMT

ఫ్యామిలీ ఆడియెన్ మెచ్చే హీరోగా జ‌గ‌ప‌తిబాబు కొన్నేళ్ల పాటు టాలీవుడ్‌లో రాణించారు. క‌థానాయ‌కుడిగా శోభ‌న్ బాబు వార‌స‌త్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేసిన జ‌గ‌ప‌తి కొన్ని వ‌రుస ఫ్లాపుల కార‌ణంగా హీరోయిజాన్ని వ‌దిలి విల‌న్ పాత్ర‌ల వైపు మొగ్గు చూపారు. ఆ స‌మ‌యంలో అత‌డి బ్యాడ్ స్క్రిప్టు ఎంపిక‌ల గురించి చాలా చ‌ర్చ సాగింది.


అయితే అత‌డు విల‌న్ గా, సహాయ న‌టుడిగా అద్భుతంగా రాణించారు. త‌న సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యంతో అంద‌రిలో స్ఫూర్తిని నింపారు. ఉన్న‌ది ఉన్న‌ట్టు ముక్కు సూటిగా మాట్లాడేందుకు, త‌న త‌ప్పుల్ని ఒప్పుకునేందుకు జ‌గ‌ప‌తిబాబు ఏనాడూ వెన‌కాడ‌డు. సూటిగా ఉన్న‌దున్న‌ట్టు చెప్ప‌డం ఆయ‌న నైజం. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లోను ఆయ‌న స్పీడ్ గా ఉన్నారు.

తాజాగా అత‌డు షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. జ‌గ్గూభాయ్ స్టైలిష్ ఫ్యాంట్ ధ‌రించి, బ్లాక్ టీష‌ర్ట్ పై లాంగ్ కోట్ తో ఎంతో స్టైలిష్ గా క‌నిపించాడు. క‌ళ్ల‌కు ఆ రేబాన్, మెడ‌లో ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ తో స్టైల్ అదిరిపోయింది. ఈ ఫోటోగ్రాఫ్ లో అత‌డు ఎంతో నేచుర‌ల్ గా క‌నిపిస్తున్నాడు. అంత‌కుమించి అత‌డి ఫ్యాష‌న్ సెన్స్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్ కి అత‌డు ఇచ్చిన క్యాప్ష‌న్ కూడా ఆక‌ట్టుకుంది. ``బ‌జారుకి పోదాం రండి!`` అంటూ జ‌గ‌ప‌తి ఫ‌న్నీ కోట్ ని ఇచ్చారు.

కెరీర్ మ్యాట‌ర్‌కి వ‌స్తే... జ‌గ‌ప‌తిబాబు ఇటీవ‌ల స్టార్ హీరోల సినిమాల్లో స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. లెజెండ్, శ్రీ‌మంతుడు, నాన్న‌కు ప్రేమ‌తో, రంగ‌స్థ‌లం, పుష్ప, పుష్ప 2 లాంటి భారీ చిత్రాల్లో అత‌డు పోషించిన పాత్ర‌ల‌కు మంచి పేరొచ్చింది. ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ లోను జ‌గ‌ప‌తి బాబు న‌టించారు.

Tags:    

Similar News