దీపికా పదుకొణే నన్ను మరింత ఆకర్షించింది!
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. జాన్వీ చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగింది.
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. జాన్వీ చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగింది. తల్లి పెద్ద నటి కావడం..తండ్రి అగ్ర నిర్మాత కావడంతో? సినిమా ప్రభావం చిన్న వయసులోనే పడింది. అలాంటి అద్భుతమైన రంగుల ప్రపంచంలో తాను సైతం అంటూ రంగంలోకి దిగి సక్సెస్ అవుతుంది. ఇప్పటికే హిందీ, తెలుగులో సినిమాలు చేస్తోంది.
అయితే శ్రీదేవి లాంటి నటిని పెట్టుకుని జాన్వీక పూర్ కి అమ్మను మించిన స్పూర్తి ఎవరు? ఉంటారు అనుకోవడం సహజం. కానీ జాన్వీ కపూర్ సినిమాల్లోకి రావడానికి మాత్రం స్పూర్తినిచ్చింది మామ్ కాదు దీపికా పదుకొణే సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా జాన్వీ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. `చిన్నప్పుడే సినిమాల్లోకి రావాలని డిసైడ్ చేసుకున్నా. ఆ ఉద్దేశంలో అన్ని రాకాల సినిమాలు చూస్తూ ఎవరు ఎలా నటించారో? స్టడీ చేసేదాన్ని.
అన్నింటికంటే `ఓంశాంతి ఓం`లో దీపికా పదుకొణే నటన నన్ను మరింత ఆకర్షించింది. ఆ సినిమా ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. అందులో దీపిక డైలాగులన్నింటిని బట్టి పటేసాను. నేను దీపికను అనుసరించింది మాచెల్లిని షారుక్ ఖాన్ లా నటించమని చెప్పేదాన్ని. అలాగే `టైటానిక్` సినిమాలో రోజ్ నేనైతే? మా చెల్లి జాక్ లా మారిపోయేది. ఈ రెండు సినిమాలో సన్నివేశాల్లో ఇద్దరం ఎన్నిసార్లు కలిసి నటించామో లెక్కలేదు.
దీపిక ద్వారా సినిమాలపై ఎక్కువగా ఆసక్తి కలిగింది. ఆమె ను చూసే యాక్టింగ్ లో టెక్నిక్ లు పట్టుకున్నాను. అప్పుడప్పుడు దీపికను అనుకరిస్తాను. అలా చేయడం వల్ల టెక్నికల్ లు తెలుస్తుంటాయి` అని తెలిపింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఆర్సీ 16లో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.