ఆ ప్ర‌చారం బాధించింది.. సినీ జ‌ర్న‌లిస్ట్ ఆవేద‌న‌..

టాలీవుడ్ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు ఇంట విషాదం.. జ‌ర్న‌లిస్ట్ స‌హోద‌రులను క‌ల‌చివేసిన సంగ‌తి తెలిసిందే.

Update: 2025-01-18 16:01 GMT

టాలీవుడ్ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు ఇంట విషాదం.. జ‌ర్న‌లిస్ట్ స‌హోద‌రులను క‌ల‌చివేసిన సంగ‌తి తెలిసిందే. జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు స‌తీమ‌ణి మాధ‌వి మ‌ర‌ణ‌వార్త తెలుసుకుని అంద‌రూ త‌మ సంతాపాన్ని తెలిపారు. తెలుగు చిత్ర‌సీమలోని జ‌ర్న‌లిస్టులు, స‌న్నిహిత‌ సినీ ప్ర‌ముఖులంతా సంతాపం ప్ర‌క‌టిస్తూ త‌మ ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేసారు.

అయితే జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు భార్య ఆత్మ‌హత్య‌ చేసుకోవ‌డానికి కార‌ణాల‌పై కొంద‌రు త‌మ‌ను ఆరా తీసార‌ని, దానికి స‌మాధానంగా నేడు ప్ర‌భు కుటుంబీకులు స్పందించారు. ఈ బాధని తట్టుకునే శక్తి ఏ దేవుడు ఇస్తాడు? అంటూ వారు త‌మ దుఃఖాన్ని బ‌య‌ట‌పెట్టారు.

ఒక విషయాన్ని మామూలుగా అర్థం చేసుకోమని చెప్పినా ఎవరుకూడా మంచి వైపు ఒక్క నిమిషం ఆలోచించని సమాజంలో బ్రతుకుతున్నాం. ఎప్ప‌టిలానే ఆఫీస్ కి వెళుతున్న భర్త‌ను గుమ్మం వ‌ర‌కూ వ‌చ్చి సాగ‌నంపిన మాధ‌వి ఆ త‌ర్వాత తిరిగిరాని లోకాల‌కు వెళ్లారు. ఆఫీస్ నుంచి తిరిగి వ‌చ్చిన జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు ఇంట్లో ఎంత వెతికినా త‌న భార్య క‌నిపించ‌క‌పోయేస‌రికి ఆందోళ‌న చెంది న‌గ‌రంలోనే నివాసం ఉంటున్న త‌న కుమార్తెకు తెలియ‌జేసారు. అనంత‌రం పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ లో స‌న్నిహితుల స‌హాయంతో కేసును న‌మోదు చేసారు.

అయితే ఈ కేసులో విచారణ అనంత‌రం.. శ్రీ‌మ‌తి మాధ‌వి న‌గ‌రంలోని దుర్గం చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌ని పోలీసులు క‌నుగొన్నారు.. ఇంట్లోనే ఫోన్ విడిచిపెట్టి వెళ్ల‌డంతో అందులో కాల్ డేటా, వాట్సప్, ఫోన్‌లోని గ్యాలరీ చెక్ చేయ‌గా, గ్యాలరీలో ఉన్న మొద‌టి వీడియో చూసి ఆమె భ‌ర్త ప్ర‌భు షాక్ కి గురయ్యారు. అది సూసైడ్‌నోట్‌ లాంటి వీడియో….ఆ వీడియోలో మాధ‌వి ఆవేద‌న‌గా మాట్లాడారు. ఆ వీడియోలో ``జమ్ముగాని వరలక్ష్మీ (మాధవి అమ్మ) జమ్ముగాని ధుర్గా ప్రసాద్‌ (మాధవి అన్న) జమ్ముగాని అనురాధ (మాధవి వదిన) మన్నెం. ఆదినారాయణతో పాటు ఆయన తమ్ముళ్లు, చెల్లెలు (బంధువులు) మమ్మల్ని మోసం చేశారు. వారిని కఠినంగా శిక్షించాలి. దానికి సంబంధించిన పేపర్స్‌ అన్ని మా దగ్గర ఉన్నాయి. మా వారికి మా పిల్లలకి ఆ విషయం తెలుసు`` అని వ్యాఖ్యానించారు.

అలాగే వీడియోలో ఇంకా మాట్లాడుతూ ``ఈ వయస్సులో మిమ్మల్ని, పిల్లల్ని ఒంటరి చేసి వెళ్లిపోతున్నాను క్ష‌మించండి`` అంటూ మాధ‌వి ఆవేద‌న చెందారు. మధ్యాహ్నం 12గంటల 1 నిమిషం సమయంలో ఈ వీడియో చేసార‌ని కుటుంబీకులు తెలిపారు. వీడియో సిద్ధం చేసిన అనంత‌రం మాధవి తన ప్లాట్‌నుండి బయటకు వచ్చి శ్రీనగర్‌ కాలనీ మెయిన్‌రోడ్‌ వైపు నడుచుకుంటూ వెళ్లి ఆటోలో దుర్గంచెరువుకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నార‌ని పోలీసులు క‌నుగొన్నారు.

అయితే జర్నలిస్ట్‌ ప్రభు తాజా మీడియా స‌మావేశంలో.. ఈ పదిహేను రోజులుగా ఎదురైన అనుభవాలన్నింటిని మీడియాకి వివరించారు. పోలీస్‌వారి నిబందనల ప్రకారం ఆమె సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నవాళ్లని తక్షణం అరెస్ట్‌ చేయాలి.. అని డిమాండ్ చేసారు. బాధ‌ల్లో ఉన్న త‌మ‌పై బుర‌ద‌జ‌ల్లుతూ.. భార్యాభ‌ర్త‌ల గొడ‌వ‌ల్లో ఏం జ‌రిగిందోనంటూ.. ప‌లువురు సందేహాలు వ్య‌క్తం చేయ‌డం మ‌రింత బాధించింద‌ని జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు ఈ స‌మావేశంలో ఆవేద‌న చెందారు. హైదరాబాద్‌ వంటి మహానగరంలో ఎవ‌రైనా తప్పిపోతే తనను వెతకటానికి సరైన సీసీటీవి ఫుటేజి ఇంతవరకు దొరకక‌పోవ‌డం ఆశ్చర్యప‌రిచింద‌ని , రెండు రోజుల తర్వాత అన్‌ ఐడెంటిఫైడ్‌ బాడీగా దొరకటం వ్యక్తిగతంగా నన్ను ఎంతో కలిచివేసిందని ప్ర‌భు ఆవేద‌న చెందారు. అవ‌స‌ర‌మైన చోట సీసీ కెమెరాల ఏర్పాటులో పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా కోరారు.

ప్రభు చిన్న కుమార్తె స్పందన మాట్లాడుతూ -``మా జీవితంలో ఇలాంటి క్షణాలుంటాయని ఎప్పుడూ అనుకోలేదు. అమ్మ ఎంతోమందికి అనేక రకాలుగా సేవచేసింది. ఎంతోమంది బంధువులను చేరదీసి హైదరాబాద్‌లో వారి భవిష్యత్తుకు ఉపయోగపడింది. అలాగే కరోనా సమయంలో వందలమందికి సాయం అందించింది. మా అమ్మ డబ్బుకోసం ఇలాంటి చావు తెచ్చుకోలేదు. ఆమె ఆత్మభిమానం కోల్పోవటంతో ఇలా తన తనువు తానే చాలించింది`` అంటూ విలపించారు.


Full View


Tags:    

Similar News