కల్పన ఆత్మహత్యాయత్నం పై కుమార్తె వ్యాఖ్యలు!
తాజాగా కల్పన కుమార్తె మీడియాతో మాట్లాడుతూ మరికొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేసింది.;
గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తృటిలో ప్రమాదం నుంచి బయట పడింది. సకాలంలో పోలీసులు స్పందించి ఆసుపత్రిలో చేర్చడంతో పరిస్థితి కుదుట పడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే కల్పన ఆత్మహత్యాయత్నంపై పోలీసులు తొలుత భర్త ను అనుమానించిన సంగతి తెలిసిందే.
మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని అతడిని విచారించారు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ కేసుతో ఆయనకు సంబంధం లేదని పోలీసులు నిర్దారించుకున్నారు. కుమార్తెతో జరిగిన వాగ్వివాదం కారణంగా కల్పన ఇలాంటి ప్రయత్నం చేసిందని కొత్త ప్రచార తెరపైకి వచ్చింది. తాజాగా కల్పన కుమార్తె మీడియాతో మాట్లాడుతూ మరికొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేసింది.
`నా తల్లి కల్పన ఆత్మహత్యాయత్నం చేయలేదు. డాక్టర్ల సూచన మేరకు జోల్ ప్రెష్ మాత్రలు తీసుకుంది. మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు. ప్రస్తుతం అమ్మ హైదరాబాద్ లోనే లా పీజీ చేస్తోంది. మానసిక ఒత్తిడితో నిద్రలేమికి గురైంది. ఈ నేపథ్యంలో అధికంగా మాత్రలు తీసుకోవడంతో అపస్మారక స్థితి లోకి వెళ్లి ఉంటుందని` తెలిపింది.
దీంతో ఈ కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చినట్లు అయింది. ఈ కేసులో పోలీసులు భర్తతో పాటు, ఇతర కుటుంబ సభ్యుల్ని, చుట్టు పక్కల వారిని కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కల్పన త్వరగా కోలుకోవాలని తోటి గాయకులు సోషల్మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.