మ్యాడ్ డైరెక్టర్.. పొలిశెట్టి కథ ఏమైనట్టు?
ఈ మధ్యకాలంలో పూర్తిగా నవ్వుకునే చిత్రంగా మ్యాడ్ మూవీ ఉందనే అభిప్రాయం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి నుంచి వస్తోంది.
సితారా ఎంటర్టైన్మెంట్స్ లో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం మ్యాడ్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. హ్యాపీడేస్ స్టొరీకి జాతిరత్నాలు కామెడీ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం కూడా అంత ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుందని ఆడియన్స్ నుంచి వస్తోన్న స్పందన.
యూత్ అయితే ఈ సినిమాని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పూర్తిగా నవ్వుకునే చిత్రంగా మ్యాడ్ మూవీ ఉందనే అభిప్రాయం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి నుంచి వస్తోంది. ఈ మూవీతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ సొంతం చేసుకొని ఇప్పుడు డైరెక్టర్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
జాతిరత్నాలు ఫేం అనుదీప్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన కళ్యాణ్ శంకర్ నిజానికి నవీన్ పోలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు అనే మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ లో స్టార్ట్ చేశారు. సినిమాకి సంబందించిన కాన్సెప్ట్ టీజర్ కూడా విడుదల చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. నవీన్ పొలిశెట్టికి కథ పెద్దగా నచ్చకపోవడంతో ఈ స్టొరీని పక్కన పెట్టాడు.
దీంతో అదే ప్రొడక్షన్ లో కళ్యాణ్ శంకర్ మ్యాడ్ స్టొరీని చెప్పి పట్టాలు ఎక్కించేశాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఆద్యంతం కడుపుబ్బా నవ్వించి సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు కళ్యాణ్ శంకర్ కి అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ కి రెండు రోజుల్లోనే మ్యాడ్ సినిమా బ్రేక్ ఎవెన్ తీసుకొచ్చింది. ఇప్పుడు వస్తోన్న కలెక్షన్స్ అన్ని కూడా లాభాలే అని చెప్పాలి.
మొత్తానికి ఒక సినిమా క్యాన్సిల్ అయిన డిజపాయింట్ కాకుండా వెంటనే మ్యాడ్ తో ఆడియన్స్ కి కూడా కళ్యాణ్ శంకర్ నవ్వులు తెప్పించాడుఅలాగే మళ్ళీ కాలేజీ రోజుల్లోనే అందరిని తీసుకొని వెళ్ళిపోయాడు. మరి మ్యాడ్ తో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఆగిపోయిన నవీన్ సినిమాను మళ్ళీ స్టార్ట్ చెస్తాడో లేదో చూడాలి.