కంగువా ఓటీటీ.. అమెజాన్ ప్రైమ్ కు బిగ్ షాక్!

అయితే మరికొద్ది రోజుల్లో కంగువా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్న వేళ.. ఇప్పుడు ఆన్ లైన్ లో కంగువా హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ లీక్ అయింది.

Update: 2024-12-01 12:23 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎపిక్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా సిరుతై శివ దర్శకత్వం వహించిన ఆ సినిమాను తమిళ బాహుబలి అంటూ మేకర్స్ ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు. కానీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ మూవీ.. బాక్సాఫీస్ వద్ద డీలా పడింది.

కంగువా చిత్రాన్ని రూ.350 కోట్లకు పైగా బడ్జెట్ తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మించగా.. ఇప్పటి వరకు సగం కూడా కలెక్షన్లు రాలేదని తెలుస్తోంది. ఫస్ట్ షోకే నెగిటివ్ టాక్ రావడంతో.. రెండో రోజుకే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయని చెప్పాలి. అలా భారీ హిట్ అవుతాదనుకున్న మూవీ.. భారీ డిజాస్టర్ గా మారింది.

మూవీ రిలీజ్ కు ముందే ఏర్పడిన క్రేజ్ కారణంగా అమెజాన్ ప్రైమ్ వీడియో కంగువా ఓటీటీ హక్కులను మంచి ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుంది. డిసెంబర్ 13వ తేదీ నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో అందుబాటులో ఉంచనుంది.

అయితే మరికొద్ది రోజుల్లో కంగువా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్న వేళ.. ఇప్పుడు ఆన్ లైన్ లో కంగువా హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ లీక్ అయింది. సినిమా రిలీజ్ అయిన గంటలో పైరసీ సైట్స్ లో అప్పుడు మూవీ ప్రత్యక్షమవ్వగా.. ఇప్పుడు థియేటర్లలో విడుదలైన కేవలం 17 రోజుల్లోనే HD ప్రింట్.. ఆన్ లైన్స్ సైట్స్ లోకి వచ్చేసింది.

దీంతో ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోకు పెద్ద దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే రికార్డు ధరతో రైట్స్ కొనుగోలు చేయగా.. మూవీ డిజాస్టర్ గా మారింది. తెలుగులో కాదు.. తమిళ సినీ ప్రియులకు కూడా సినిమా నచ్చలేదు. కాబట్టి ఓటీటీలో భారీ వ్యూస్ కచ్చితంగా వస్తాయని ఎవరూ చెప్పలేరు. అందుకే వ్యూస్ ద్వారా లాభాలు రావడం డౌటే!

అలాంటిది స్ట్రీమింగ్ కు కొద్ది రోజుల ముందు హెచ్ డీ ప్రింట్ లీక్ కావడం.. అమెజాన్ ప్రైమ్ కు భారీ నష్టమే కలిగిస్తుంది. వ్యూయర్స్ కౌంట్ ను దెబ్బతీస్తుంది. అయితే హెచ్ డీ ప్రింట్ లీక్ అవ్వడం వల్ల ఓటీటీ రిలీజ్ ను అమెజాన్ ప్రీ పోన్ చేయనున్నట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. మరి ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News