బిగ్ సినిమాల రూట్లోనే.. కన్నప్ప కూడా
ఇప్పుడు టాలీవుడ్ లో పాన్ ఇండియా కల్చర్ నడుస్తోంది. మినిమమ్ రేంజ్ హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ కూడా యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలతో మూవీస్ చేస్తూ వాటిని ఐదు భాషలలో రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పుడు టాలీవుడ్ లో పాన్ ఇండియా కల్చర్ నడుస్తోంది. మినిమమ్ రేంజ్ హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ కూడా యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలతో మూవీస్ చేస్తూ వాటిని ఐదు భాషలలో రిలీజ్ చేస్తున్నారు. డిజిటల్ మార్కెట్ ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ రకంగా సినిమాలు చేస్తున్నారు. వీటిలో కొన్ని వర్క్ అవుట్ అయ్యి పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ అవుతున్నాయి.
స్టార్ హీరోలకి ఇప్పటికే తెలుగుతో పాటు నార్త్ ఇండియాలో మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఈ పాన్ ఇండియా కల్చర్ కి అదనంగా ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. దర్శకులు అందరూ కూడా తాము చేసే కథలని ఒక పార్ట్ కి పరిమితం చేయకుండా సీక్వెల్స్ లా చేయాలని భావిస్తున్నారు. అందుకే మూవీ క్లైమాక్స్ లో పార్ట్ 2కి లీడ్ ఇస్తున్నారు.
మొదటి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే పార్ట్ 2పై ఆటోమేటిక్ గా హైప్ క్రియేట్ అవుతుంది. అప్పుడు రెట్టింపు కలెక్షన్స్ ని సీక్వెల్ తో రాబట్టొచ్చు అనే మార్కెటింగ్ ప్లాన్ కూడా ఇందులో ఉంది. కొంతమంది అయితే సినిమా షూటింగ్ ల సమయంలోనే రెండు భాగాలుగా వస్తుందని ఎనౌన్స్ చేసేస్తున్నారు. గత ఏడాది చాలా సినిమాలు సీక్వెల్ ప్రమోషన్స్ తో రిలీజ్ అయ్యాయి. కానీ వర్క్ అవుట్ కాలేదు.
ఎన్టీఆర్ దేవర రెండు భాగాలుగా రాబోతోంది, ప్రభాస్ కల్కి రెండు పార్ట్స్ గానే నాగ్ అశ్విన్ చేస్తున్నారు. పుష్ప 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. పుష్ప 3 కూడా ఉంటుందని అల్లు అర్జున్ కన్ఫర్మ్ చేశారు. అలాగే కాంతారా 2 సిద్ధం అవుతోంది. కార్తికేయ సిరీస్ కూడా నడవనున్నట్లు నిఖిల్ కన్ఫర్మ్ చేశారు. విశ్వంభర కూడా రెండు భాగాలుగానే వచ్చే ఛాన్స్ ఉంది. వీటి దారిలోనే మంచు విష్ణు కన్నప్ప కూడా నడుస్తోంది.
ఈ సినిమాని కూడా రెండు భాగాలుగానే రిలీజ్ చేయబోతున్నారంట. హిస్టారికల్ కథగా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. ప్రభాస్ మూవీలో శివుడిగా కనిపించబోతున్నాడు. భక్తికి చారిత్రక సంఘటనలని అనుసంధానించి ఈ మూవీ కథని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణుకి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి. ఇక మహా శివరాత్రి సందర్భంగా ప్రభాస్ శివుడి లుక్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.