ఆ పాటతో క్యాట్ నెట్టింట సంచలనమేనా!
ఈ సందర్భంగా కత్రినా కైఫ్ మాట్లాడుతూ.. 'లేకే ప్రభు కా నామ్' విజువల్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. నేను అభిమానించే పాటల్లో ఇదొకటి.
సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ జంటగా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'టైగర్ -3' తెరకెక్కుతోన్న సంగతి తెలి సిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు ఆకాశన్నంటేలా చేసాయి. ఇక పాటలతోనే ఈ జోడీ మాయ చేయడానికి రెడీ అవుతోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 23న ఈ చిత్రం నుంచి 'లేకే ప్రభు కా నామ్..' పాట రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కత్రినా ఓ రేంజ్ లో ఆకట్టుకోబుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.
ఈ పాటని ఏకంగా 7 అద్భుతమైన లుక్స్‌తో మెస్మరైజ్ చేయబోతుందిట. కత్రినా కెరీర్ లో ది బెస్ట్ సాంగ్ గా నిలవబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. విజువల్ గానూ పాట అంతే హైలైట్ అవుతుందం టు న్నారు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ మాట్లాడుతూ.. 'లేకే ప్రభు కా నామ్’ విజువల్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. నేను అభిమానించే పాటల్లో ఇదొకటి.
టర్కీలోని కాప్పడోసియా ప్రాంతంలో ఈ పాటను చిత్రీకరించారు. మాషాల్లా.. స్వాగ్ సే స్వాగత్ పాటల తర్వాత నా ఫేవరేట్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్‌తో కలిసి పని చేయటం ఎంతో సంతోషాన్నిచ్చింది. అనితా ష్రాఫ్ అజానియా ఈ పాటలో నన్ను ఎంతో అందంగా అద్భుతంగా చూపించారు.
ఏకంగా ఏడు మెస్మరైజింగ్ లుక్స్‌లో ఆకట్టుకుంటాను. టైగర్ ఫ్రాంచైజీ నుంచి వచ్చే పాట ఎప్పుడూ చార్ట్ బస్టర్‌గా నిలుస్తుంది. అదే కోవలో లేకే ప్రభు కా నామ్ పాటను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతు న్నాను. వైభవి పాటను చిత్రీకరించిన తీరు.. టైగర్.. జోయా మధ్య ఉండే కెమిస్ట్రీ సరికొత్తగా అలరించ నుంది. సల్మాన్ తొ కలిసి డాన్స్ చేయటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా' అని అన్నారు.
సినిమాలో కత్రినా కైఫ్ జోయా అనే పాత్రలో నటిస్తోంది. ఈ పాటను ప్రీతమ్ కంపోజ్ చేయగా బెన్నీ దయాల్- అనుషా మణి ఆలపించారు. ఈ పార్టీ సాంగ్ ఈ సీజన్లో హైలైట్ అవుతుందంటున్నారు.
యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన టైగర్ 3 చిత్రాన్ని మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించారు. హిందీ- తెలుగు- తమిళ భాషల్లో నవంబర్ 12న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుంది.