డ్రాగన్ బ్యూటీ క్రేజ్ తగ్గట్టుగానే..!

ఇప్పటికే తెలుగు, తమిళ్ లో వరుస ఆఫర్లు అందుకుంటుంది కయదు. అనుదీప్ కెవి, విశ్వక్ సేన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో అమ్మడు లక్కీ ఛాన్స్ అందుకుంది.;

Update: 2025-04-02 03:15 GMT
డ్రాగన్ బ్యూటీ క్రేజ్ తగ్గట్టుగానే..!

ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ఎప్పుడు పాపులర్ అయ్యామన్నది ముఖ్యం అన్నట్టుగా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్లయ్యింది అన్నది కాదు. ఎప్పుడు క్రేజ్ తెచ్చుకున్నాం అన్నది హీరోయిన్స్ కి లెక్క ఉంటుంది. అలా చేస్తున్న సినిమాలతో సినిమా సినిమాకు తమ రేంజ్ పెంచుకునే వారిలో చాలామంది భామలు ఉండగా వారిలో కొత్తగా డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ చేరింది. ప్రదీప్ రంగనాథన్ తో డ్రాగన్ సినిమాలో అమ్మడు నటించగా ఆ సినిమాతో సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది.

ఐతే ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ కి అదిరిపోయే మార్కులు పడ్డాయి. డ్రాగన్ ముందు వరకు కయదు రేంజ్ వేరు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక కయదు లెవెల్ మారిపోయింది. డ్రాగన్ హిట్ తో యూత్ లో కయదుకి సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఐతే డ్రాగన్ బ్యూటీ తన పాపులారిటీకి తగినట్టుగానే ప్లానింగ్ చేస్తుంది.

ఇప్పటికే తెలుగు, తమిళ్ లో వరుస ఆఫర్లు అందుకుంటుంది కయదు. అనుదీప్ కెవి, విశ్వక్ సేన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో అమ్మడు లక్కీ ఛాన్స్ అందుకుంది. జాతిరత్నాలు సినిమా డైరెక్టర్, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరో కాబట్టి ఈ సినిమా తప్పనిసరిగా కయదుకి మంచి హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు. ఇదిలాఉంటే అమ్మడు సోషల్ మీడియా లో కూడా సందడి చేస్తుంది.

ఆడియన్స్ లో తనకు వచ్చిన ఈ ఐడెంటిటీని మరింత పెంచుకునేలా చేస్తుంది కయదు లోహార్. అమ్మడు ఇలా ఫోటో షేర్ చేస్తే చాలు అలా వైరల్ అయిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ అయితే కయదు అంటే చాలా క్రేజీగా ఉన్నారు. ఆల్రెడీ కయదు టాలెంట్ చూసే శ్రీవిష్ణు అల్లూరి సినిమాకు ఆమెకు తీసుకున్నాడు. కానీ ఆ సినిమా వర్క్ అవుట్ కాకపోవడంతో ఆమెను ఎవరు పట్టించుకోలేదు. డ్రాగన్ సినిమా సక్సెస్ తర్వాత శ్రీవిష్ణు అల్లూరి సినిమా వీడియోస్ ట్రెండ్ అయ్యాయంటే కయదుకి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

ఐతే పాపులారిటీ అందరికీ వస్తుంది కానీ దాన్ని సక్సెస్ ఫుల్ కెరీర్ గా మలచుకోవడంలోనే కథానాయికల క్లవర్ నెస్ ఆధారపడి ఉంటుంది. అందుకే కయదు కూడా మంచి ప్లానింగ్ తోనే సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి తెలుగులో అమ్మడికి వచ్చిన ఈ క్రేజ్ తో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లేలా తన సినిమాల సెలక్షన్ ఉంటుందా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News