కీర్తి సురేష్‌ పెళ్లి సేమ్‌ టు సేమ్‌ సమంత పెళ్లి..!

మహానటి ఫేం కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే ఈమె పెళ్లికి రెడీ కావడం చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-12-05 04:57 GMT

మహానటి ఫేం కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే ఈమె పెళ్లికి రెడీ కావడం చర్చనీయాంశంగా మారింది. గత రెండు మూడు సంవత్సరాలుగా కీర్తి సురేష్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ సమయంలో కీర్తి సురేష్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి వార్తలను కొట్టి పారేస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం కీర్తి సురేష్ స్వయంగా తన పెళ్లి గురించి చెప్పింది. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన సమయంలో మీడియా వారితో మాట్లాడుతూ పెళ్లి విషయమై అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది.

డిసెంబర్‌లో తన వివాహం గోవాలో జరగబోతుందని అధికారికంగా ప్రకటించింది. గోవాలో పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. కీర్తి సురేష్ హిందువు కాగా, ఆమె పెళ్లి చేసుకోబోతున్న ఆంటోనీ క్రిస్టియన్‌ కావడంతో రెండు మతాల పద్దతుల్లో వివాహం జరగబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈమధ్య కాలంలో చాలా మంది సెలబ్రెటీలు హిందూ, క్రిస్టియన్‌ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. గతంలో నాగ చైతన్య, సమంతల వివాహం సైతం అలాగే జరిగింది.

2017లో నాగ చైతన్య, సమంతల వివాహం గోవాలో హిందూ, క్రిస్టియన్‌ సాంప్రదాయాల ప్రకారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. చాలా వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్‌ జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వారిద్దరూ కొన్నాళ్లకే విడి పోయారు. విడిపోయిన సమయంలో వారు ఎంతగా బాధ పడ్డారో కానీ, వారి విడాకుల విషయం తెలిసి ఫ్యాన్స్‌ తో పాటు సామాన్యులు సైతం చాలా బాధ పడ్డారు. అందమైన జంట అనుకుంటే ఇలా జరిగింది ఏంటని అంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కీర్తి సురేష్ వివాహం సందర్భంగా సమంత వివాహం గురించిన చర్చ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

సమంత వివాహం గోవాలో రెండు మతాల సాంప్రదాయాల ప్రకారం జరిగినట్లుగానే కీర్తి సురేష్ వివాహం జరుగుతుంది. కీర్తి సురేష్‌ వివాహం మొదట రిసార్ట్స్‌లో హిందూ సాంప్రదాయాల ప్రకారం జరగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్‌ 12న ఉదయం కీర్తి సురేష్ మెడలో ఆంటోనీ తాళి కట్టబోతున్నాడు. అదే రోజు సాయంత్రం సమయంలో గోవాలోని ప్రముఖ చర్చ్‌లో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకోబోతున్నారు. కాస్త అటు ఇటుగా సమంత, చైతూల వివాహం జరిగినట్లుగానే కీర్తి సురేష్‌, ఆంటోనీల వివాహం జరగబోతుంది. కీర్తి సురేష్ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటూ ఆమె ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News