కేతిక శర్మ.. ట్రెడిషినల్ లుక్కులో కూడా అదే జోరు
ఫ్యాషన్ ఫోటోషూట్‌లో కేతిక చూపించిన డిఫర్5 లుక్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
తన క్యూట్ లుక్స్, గ్లామర్ ప్రెజెన్స్ తో యూత్ ని కట్టిపడేస్తోన్న కేతిక శర్మ మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతూ, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. "భయంకరమైన సోల్, ధైర్యంగల హృదయం మరియు దృఢమైన మనస్సు" అనే క్యాప్షన్‌తో ఫోటోలను షేర్ చేసింది. ఫ్యాషన్ ఫోటోషూట్‌లో కేతిక చూపించిన డిఫర్5 లుక్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
ఎక్కువగా గ్లామర్ డోస్ తో కనిపించే అమ్మడు ఈ ఈసారి ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టింది. బ్రాండెడ్ హాఫ్ సారీలో ఆమె చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. దానికితోడు అందమైన హ్యాండ్‌మేడ్ జ్యూవెలరీ, ట్రెడిషనల్ హేర్స్టైల్తో ఆమె లుక్ అభిమానులను మాయ చేస్తోంది. కేతిక ధరించిన ఆభరణాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫోటో షూట్లో తన గ్లామర్ ని కంట్రోల్ చేస్తూ స్టన్నింగ్ లుక్ ని ప్రదర్శించడం అందరి హృదయాలను దోచుకుంది.
అయితే, కేతిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్ల తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్‌లో ఉన్న ఫ్యాషన్ స్టేట్మెంట్స్ను ఫాలో అవుతూ, తరచూ ఫోటోషూట్ల ద్వారా తన అందం, స్టైల్ చూపించడం కేతిక స్పెషాలిటీ. ఈ ఫోటోలు ఆమె ఫ్యాషన్ ఐకాన్ గా కూడా పాపులారిటీ తెచ్చాయి.
కేతిక సినిమాల విషయానికి వస్తే, ‘రొమాంటిక్’, ‘లక్ష్య’, ‘రంగ రంగ వైభవంగా’, ‘బ్రో’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా, ఆమె ఇంకా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది. అయితే తన సపరేట్ స్టైల్, క్యూట్ లుక్స్‌తో టాలీవుడ్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇలాంటి ప్రత్యేక ఫోటోషూట్లతో కేతిక తన క్రేజ్ ను మరింత పెంచుకుంటూ ఉంది. మరి ఈ గ్లామర్ ఫొటో షూట్స్ ద్వారా అమ్మడు ఏమైనా కొత్త ఆఫర్స్ అందుకుంటుందేమో చూడాలి.