కియారాకి చరణ్ తెలుగు నేర్పించాడా?
ఇంత వరకూ రామ్ చరణ్ ఏ హీరోయిన్ కు ఇలా తెలుగు నేర్పించలేదు. తొలిసారి ఆ ఛాన్స్ కియారా కొట్టేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా రెండు సినిమాలు చేసిన సంగతి తెలి సిందే. తొలిసారి ఆ జోడీ 'వినయ విధేయ రామ'లో కనిపించింది. అటుపై 'గేమ్ ఛేంజర్' కోసం చేతులు కలిపారు. ఈ సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్' తో సందడి చేయనున్నారు. ఈ రెండు సినిమాలో కియారా చరణ్ కి మంచి స్నేహి తురాలిగాను మారిపోయింది. ప్రస్తుతం ఇద్దరు 'గేమ్ ఛేంజర్' ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ షోలు సైతం చుట్టేస్తున్నారు. దీనిలో భాగంగా ఇద్దరు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కియారా ఆ షోలో తెలుగు మాట్లాడి సంచలనమైంది. 'నేను మిమ్మల్ని కలిసాక చాలా మంచిగా అనిపించింది అంటూ సల్మాన్ ఖాన్ ని చూసి కియారా చెబుతుంది. వెంటనే సల్మాన్ వారెవ్వా అంటాడు. ఆ సమయంలో చరణ్ పక్కనే ఉన్నాడు. అతడు నాట్ బ్యాడ్ అంటాడు. సల్మాన్ వెంటనే చరణ్ వైపు చూస్తాడు. ఏం చరణ్ ఈ తెలుగు నువ్వు నేర్పించావా? అన్నట్లో ఓ ఎక్స్ ప్రెషన్ ఇస్తాడు. చరణ్ కూడా ఊకొడతాడు.
ఇంత వరకూ రామ్ చరణ్ ఏ హీరోయిన్ కు ఇలా తెలుగు నేర్పించలేదు. తొలిసారి ఆ ఛాన్స్ కియారా కొట్టేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కియారా తెలుగు మాట్లాడుతుంటే? ఎంతో ముద్దుగా ఉందంటూ నెటి జనులు పోస్టులు పెడుతున్నారు. మన భాష రాని అమ్మాయి తెలుగు మాట్లాడితే ఆ కమ్మదనమే వేరుగా ఉం టుందంటూ మరోకరు పోస్టు పెట్టారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొస్తుంది. అయితే ఇక్కడో సెంటిమెంట్ వ్యక్తమవుతుంది. కియారా- చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఇంకా చెప్పాలంటే సినిమా ఘోర పరాజయం చెందింది. ఆ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.