కిరణ్ అబ్బవరం.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు!

ఎస్.ఆర్ కళ్యాణ్ మండపం. సమ్మోహనమే, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

Update: 2024-07-03 05:21 GMT

టాలీవుడ్ లో నటుడిగా తనదైన గుర్తింపుతో దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన కిరణ్ అబ్బవరం తరువాత వరుసగా అవకాశాలు అందుకుంటూ వచ్చాడు. ఎస్.ఆర్ కళ్యాణ్ మండపం. సమ్మోహనమే, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఆయన నుంచి చివరిగా వచ్చిన మీటర్, రూల్స్ రంజన్ సినిమా డిజాస్టర్ అయ్యాయి. అయిన కూడా కిరణ్ అబ్బవరంకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అతనితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. పెద్ద ప్రొడక్షన్ హౌస్ సైతం కిరణ్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇండస్ట్రీలో చిన్న సినిమాలకి హీరోల కొరత ఉందనే మాట చాలా కాలంగా ప్రచారంలో ఉంది.

కొత్త దర్శకులు లోబడ్జెట్ తో మంచి ఇంటరెస్టింగ్ కథలని చెప్పాలని అనుకుంటారు. అలాంటి వారికి సుహాస్, కిరణ్ అబ్బవరం లాంటివారు ఛాయస్ గా ఉన్నారు. గత ఏడాది రూల్స్ రంజన్ ఫ్లాప్ తర్వాత కిరణ్ అబ్బవరం ఇప్పటి వరకు ఎలాంటి సినిమాని ఎనౌన్స్ చేయలేదు. బయట కనిపిస్తున్న లుక్ పరంగా ట్రాన్స్ ఫర్మేషన్ అవుతూ దర్శనమిస్తున్నాడు.

అప్పుడప్పుడు ఫోటోషూట్ లతో కిరణ్ అబ్బవరం సందడి చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఇప్పుడో టాక్ స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. కిరణ్ అబ్బవరం పీరియాడిక్ జోనర్ లో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. ఈ సినిమాని ఏకంగా 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారంట. మూవీకి కిరణ్ ప్రెజెంటర్ గా ఉండబోతున్నాడంట. దగ్గరుండి ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ మొత్తం కిరణ్ చేయించుకున్నాడని టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబందించిన ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని కథనాలు వినిపిస్తున్నాయి.

Read more!

ఈ సారి చేయబోయే సినిమాలో కిరణ్ అబ్బవరం లుక్, స్టోరీ బ్యాక్ డ్రాప్, విజువలైజేషన్, మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవల్ లో ఉంటాయంట. ఈ సినిమా కోసమే కిరణ్ మేకోవర్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని ఫ్లాప్ లు వచ్చిన తర్వాత కూడా అతని మార్కెట్ కి మించిన బడ్జెట్ తో కిరణ్ సినిమా చేస్తున్నాడంటే కచ్చితంగా గ్రేట్ అని చెప్పొచ్చు. మరి ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు ఉంటుందనేది అంతటా ఆసక్తి నెలకొని ఉంది. నిజానికి కిరణ్ అబ్బవరం హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత గ్యాప్ తీసుకోలేదు. అయితే ఈ సారి లాంగ్ గ్యాప్ తీసుకున్నాడంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News

eac