కిరణ్ అబ్బవరం నెక్స్ట్… ఇదేదో కొత్తగా ఉందే..

తాజాగా కొత్త సినిమాకి సంబందించి ఇంట్రస్టింగ్ పోస్టర్ తో టైటిల్ ఎనౌన్స్మెంట్ గురించి కిరణ్ అబ్బవరం క్లారిటీ ఇచ్చాడు.

Update: 2024-07-07 08:02 GMT

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. రాజావారు రాణిగారు సినిమా నుంచి రూల్స్ రంజన్ మూవీ వరకు డిఫరెంట్ కథలు చేస్తూ వచ్చాడు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కిరణ్ అవకాశాలు అందుకుంటున్నాడు. అయితే రూల్స్ రంజన్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని డిఫరెంట్ కథతో రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం చాలా టైం తీసుకున్నాడు.

 

లుక్ పరంగా కూడా మేకోవర్ అయ్యి కనిపిస్తున్నాడు. అప్పుడప్పుడు తన కొత్త లుక్స్ కి సంబందించిన అప్డేట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ సారి ఈ కిరణ్ అబ్బవరం కూడా పాన్ ఇండియా లెవల్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నాడు. పీరియాడిక్ జోనర్ కథతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నాడు.

తాజాగా కొత్త సినిమాకి సంబందించి ఇంట్రస్టింగ్ పోస్టర్ తో టైటిల్ ఎనౌన్స్మెంట్ గురించి కిరణ్ అబ్బవరం క్లారిటీ ఇచ్చాడు. పాతకాలం పోస్ట్ కార్డు మీద ఫ్రమ్ అడ్రెస్ లో అభినయ్ వాసుదేవ్ అని రాసి ఉంది. టూ అడ్రెస్ దగ్గర దీపాల పద్మనాభం, సబ్ ఇన్ స్పెక్టర్, క్రిష్ణగిరి పోలీస్ స్టేషన్, క్రిష్ణగిరి అని రాసి ఉంది. మధ్యలో రెడ్ కలర్ లో మ్యాప్ ని ఎస్టాబ్లిష్ చేసి అందులో టైటిల్ ఎనౌన్స్ మెంట్ జులై 9న ఉండబోతోందని క్లారిటీ ఇచ్చారు.

ఈ కాన్సెప్ట్ పోస్ట్ కార్డు బట్టి రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతోన్న సినిమా తరహాలో కనిపిస్తోంది. అలాగే కృష్ణగిరి పోలీస్ స్టేషన్ అయితే తమిళనాడులో ఉంది. కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకి దగ్గర్లో క్రిష్ణగిరి ఉంది. దీనిని బట్టి కథ నేపథ్యం ఆంధ్రా, తమిళనాడు విడిపోకముందు జరిగిన సంఘటనలతో ఉండొచ్చనే మాట వినిపిస్తోంది.

అలాగే క్రైమ్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. కిరణ్ అబ్బవరం ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. జులై 9 ఉదయం 11.01 గంటలకి ఈ మూవీ టైటిల్ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ కాన్సెప్ట్ పోస్టర్ తో రివీల్ చేశారు. ఈ సినిమా కోసం కిరణ్ చాలా ఎఫర్ట్స్ పెట్టినట్లు తెలుస్తోంది.

పీరియాడిక్ జోనర్ కథాంశంతో రాబోతున్న సినిమా కాబట్టి కచ్చితంగా పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాయలసీమ నేపథ్యం ఉండబోతున్న నేపథ్యంలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Tags:    

Similar News